త్వరలో ఇంటివాడు కానున్న జహీర్ | Zaheer Khan to tie knot with Sagarika Ghatge in November | Sakshi
Sakshi News home page

త్వరలో ఇంటివాడు కానున్న జహీర్

Sep 14 2017 12:56 PM | Updated on Sep 19 2017 4:33 PM

త్వరలో ఇంటివాడు కానున్న జహీర్

త్వరలో ఇంటివాడు కానున్న జహీర్

టీమిండియా మాజీ స్పీడ్స్టార్ జహీర్ ఖాన్ త్వరలో ఇంటివాడు కానున్నారు.

న్యూఢిల్లీ:టీమిండియా మాజీ స్పీడ్స్టార్ జహీర్ ఖాన్ త్వరలో ఇంటివాడు కానున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో తన ప్రియురాలు, బాలీవుడ్ నటి సాగరిక ఘాట్గెతో నిశ్చితార్థం చేసుకున్న జహీర్.. వచ్చే నవంబర్ లో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. అయితే అదే నెలలో రెండు వేర్వేరు వేడుకల్ని చేసుకోవడానికి జహీర్ ప్లాన్ చేసుకుంటున్నారు. తొలుత ముంబైలో, ఆపై పుణెలో వేడుకల్ని చేసుకోనున్నట్లు జహీర్ స్నేహితులు తెలిపారు.

 

గత కొన్నేళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట.. గత కొన్ని నెలల క్రితం జరిగిన క్రికెటర్ యువరాజ్ సింగ్-నటి హజల్ కీచ్ వివాహ వేడుకకు హాజరు కావడంతో వారిద్దరూ డేటింగ్ ఉన్నారనే విషయం మరింత బలపడింది. ఆ క్రమంలోనే  తమపై వస్తున్న రూమర్లకు ఏప్రిల్ నెలలో నిశ్చితార్థంతో ఫుల్ స్టాప్ పెట్టారు. ఏప్రిల్ 25 తేదీన సాగరికతో నిశ్చితార్థం అయిన విషయాన్ని జహీర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. 'మీ భార్య ఎంపికలపై నవ్వకండి. ఎందుకంటే అందులో మీరు కూడా ఉన్నారు. ఇక నుంచి జీవితాంతం భాగస్వాములం’ అని సాగరిక చేతికి ఉంగరం పెట్టిన ఫొటోను జహీర్ ట్వీట్ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement