క్యాన్సర్ రోగుల కోసం... | Yuvraj Singh takes his cancer charity drive to London | Sakshi
Sakshi News home page

క్యాన్సర్ రోగుల కోసం...

Jul 9 2014 1:19 AM | Updated on May 28 2018 2:10 PM

క్యాన్సర్ రోగుల కోసం... - Sakshi

క్యాన్సర్ రోగుల కోసం...

క్యాన్సర్ రోగుల సహాయార్థం నిధుల సేకరణకు భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ నడుం బిగించాడు.

లండన్: క్యాన్సర్ రోగుల సహాయార్థం నిధుల సేకరణకు భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ నడుం బిగించాడు. క్యాన్సర్ బారిన పడి కోలుకున్న యువరాజ్ తన చారిటీ ‘యు వియ్ కెన్’ ఆధ్వర్యంలో ఈ నెల 14న లండన్‌లోని హిల్టన్ హోటల్‌లో క్రికెట్ జ్ఞాపికలను వేలానికి ఉంచనున్నాడు.
 
  200వ టెస్టులో సచిన్ వేసుకున్న టీ షర్ట్, 2011 ప్రపంచకప్‌లో యువీ అందుకున్న పతకంతో పాటు పలు జ్ఞాపికలు వేలం వేస్తారు. వీటిని దక్కించుకున్న వారు యువరాజ్‌తో ప్రాక్టీస్‌లో పాల్గొనడమే కాకుండా విందు చేసే అవకాశం దక్కుతుంది. ఈ వేలానికి క్రికెట్ దిగ్గజం సచిన్, గంగూలీ, ద్రవిడ్, కెవిన్ పీటర్సన్‌తో పాటు భారత క్రికెటర్ విరాట్ కోహ్లి హాజరుకానున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement