యువీ హార్ట్‌ టచింగ్‌ వీడియో.. వైరల్‌ | Yuvraj Singh Shares Emotional Video After Retirement | Sakshi
Sakshi News home page

యువీ హార్ట్‌ టచింగ్‌ వీడియో.. వైరల్‌

Jun 10 2019 6:17 PM | Updated on Jun 10 2019 6:59 PM

Yuvraj Singh Shares Emotional Video After Retirement - Sakshi

ముంబై: రెండు ప్రపంచకప్‌ల హీరో, టీమిండియా లెజెండ్‌ యువరాజ్‌ సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. బీసీసీఐతో చర్చలు జరిపించిన అనంతరం సోమవారం ముంబైలో మీడియా సమావేశం నిర్వహించి రిటైర్మెంట్‌ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌, ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలికాడు. అయితే ఈ సందర్భంగా యువీ తన అధికారిక ఫెస్‌బుక్‌ పేజీలో ఓ వీడియో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్‌ చేస్తోంది. ఈ వీడియో హార్ట్‌ టచింగ్‌గా ఉందంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తేన్నారు. 

‘వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయం అనిపించింది. దాదాపు 17 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. జీవితంలో ఏ విధంగా పోరాడాలో ఆటనే నేర్పింది. నాకు అవకాశం ఇచ్చిన బీసీసీఐకి ధన్యవాదాలు. నా జట్టు సభ్యులకు కృతజ్ఞతలు. కష్ట కాలంలో నా వెంట ఉన్న కుటుంబ సభ్యులకు రుణపడి ఉంటా’అంటూ వీడియోలో యువీ తెలిపాడు. అంతేకాకుండా ఎన్నో ఆసక్తికర విషయాలను యువీ ఈ వీడియోలో వెల్లడించాడు. 



చదవండి:
క్రికెట్‌ ఎంత ఇష్టమో.. అంత అయిష్టం
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన యువరాజ్‌ సింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement