'ప్రిన్స్ ఈజ్ బ్యాక్' | Yuvraj Singh returns to practice after recovering from fever | Sakshi
Sakshi News home page

'ప్రిన్స్ ఈజ్ బ్యాక్'

May 30 2017 12:03 PM | Updated on Sep 5 2017 12:22 PM

'ప్రిన్స్ ఈజ్ బ్యాక్'

'ప్రిన్స్ ఈజ్ బ్యాక్'

చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా అనారోగ్యం కారణంగా న్యూజిలాండ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ కు దూరమైన భారత స్టార్ ఆటగాడు యువరాజ్ తిరిగి కోలుకున్నాడు.

లండన్: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ కు  అనారోగ్యం కారణంగా దూరమైన భారత స్టార్ ఆటగాడు యువరాజ్ తిరిగి కోలుకున్నాడు. భారత జట్టు ఇంగ్లండ్ కు చేరుకున్న అనంతరం అక్కడి వాతావరణ పరిస్థితుల్లో మార్పు కారణంగా యువరాజ్ అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో భారత్ ఆడిన తొలి వార్మప్ మ్యాచ్ కు యువీ దూరం కావాల్సి వచ్చింది.

 

అయితే మంగళవారం బంగ్లాదేశ్ జరిగే రెండో వార్మప్ మ్యాచ్ కు యువీ సిద్ధమైనట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ప్రకటించింది. 'కీప్ కామ్.. ద ప్రిన్స్ ఈజ్ బ్యాక్' అనే క్యాప్షన్ తో యువీ జట్టుతో కలవడాన్ని బీసీసీఐ తన ట్విట్టర్ అకౌంట్ లో  స్పష్టం చేసింది. ఈ మేరకు యువీ ఫోటోను జతను చేసింది. దాంతో యువరాజ్ ఆడటంపై భారత జట్టులో నెలకొన్న తొలగిపోయినట్లయ్యింది. యువరాజ్ జట్టులో కలవడంతో భారత జట్టు బ్యాటింగ్ బలం మరింత పెరిగింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement