యువరాజ్ వస్తాడా? | yuvraj is come back in one day matches? | Sakshi
Sakshi News home page

యువరాజ్ వస్తాడా?

Oct 5 2016 11:24 PM | Updated on Sep 4 2017 4:17 PM

యువరాజ్ వస్తాడా?

యువరాజ్ వస్తాడా?

ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని కొత్త సెలక్షన్ కమిటీ తొలిసారి నేడు సమావేశం కాబోతోంది.

భారత వన్డే జట్టు ఎంపిక నేడు
న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్  


న్యూఢిల్లీ: ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని కొత్త సెలక్షన్ కమిటీ తొలిసారి నేడు సమావేశం కాబోతోంది. న్యూజిలాండ్‌తో ఈ నెల 16 నుంచి జరిగే ఐదు వన్డేల సిరీస్ కోసం భారత జట్టు ఎంపిక నేడు జరగనుంది. వన్డే కెప్టెన్ ధోని నేతృత్వంలోని జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. అరుుతే ప్రస్తుతం రాహుల్, ధావన్ ఇద్దరూ గాయాలతో ఉండటంతో కొత్త  ఓపెనర్‌ను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నారుు. అరుుతే ప్రస్తుతం టెస్టు జట్టుతో ఉన్న గంభీర్ కూడా రేసులోనే ఉన్నాడు. అరుుతే యువరాజ్ సింగ్ మళ్లీ వన్డే జట్టులోకి వస్తాడా? అనేదే ఆసక్తికరం. దులీప్‌ట్రోఫీ సందర్భంగా కుంబ్లేతో మాట్లాడిన యువరాజ్ సింగ్ ఇటీవల ఎన్‌సీఏకు వెళ్లి ఫిట్‌నెస్ టెస్టులో పాల్గొని పాసయ్యాడు.

ఈ నేపథ్యంలో వన్డేల్లోకి యువరాజ్ పునరాగమనం ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు రైనా కూడా పునరాగమనం కోసం ఎదురు చూస్తున్నాడు. అశ్విన్, జడేజాలతో పాటు మూడో స్పిన్నర్‌గా యజువేంద్ర చహల్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇర్ఫాన్ పఠాన్, హార్దిక్ పాండ్యా, స్టువర్ట్ బిన్నీ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ స్లాట్ కోసం పోటీ పడుతున్నారు. ఒకట్రెండు మార్పులు మినహా పెద్దగా సంచలనాలు లేకుండానే ఎమ్మెస్కే సారథ్యంలోని కొత్త సెలక్టర్లు పని పూర్తి చేసే అవకాశం ఉంది.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement