ధోని వీరాభిమాని!  | Young Fan Reaction to Dhoni Duck Against Hong Kong | Sakshi
Sakshi News home page

ధోని వీరాభిమాని! 

Sep 20 2018 1:44 AM | Updated on Sep 20 2018 1:44 AM

Young Fan Reaction to Dhoni Duck Against Hong Kong  - Sakshi

హాంకాంగ్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ధోని డకౌట్‌గా వెనుదిరిగిన సమయంలో ఒక కుర్రాడి హావభావాలు చూశారా! తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ అతను తన అసహనాన్ని ప్రదర్శించాడు. తాను కూర్చున్న కుర్చీని కూడా దాదాపు విరగ్గొట్టినంత పని చేసిన అతను ధోని ఔట్‌ కాగానే స్టాండ్స్‌లో ఎక్కడికో వెనక్కి వెళ్లిపోయి కూర్చున్నాడు. స్టార్‌ స్పోర్ట్స్‌ కూడా పదే పదే ఈ అబ్బాయి ఉద్వేగంగా అరుస్తున్న దృశ్యాలను చూపించింది. మ్యాచ్‌ ముగిశాక అతను స్థానిక మీడియాలో ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు.
 

టీవీ చానళ్లు, రేడియో స్టేషన్‌లు కూడా అతడిని స్టూడియోకు పిలిపించి ‘అంత కోపం ఎందుకు’ అనే శీర్షికతో కార్యక్రమాలు ప్రసారం చేశాయి. ఆ అబ్బాయి పేరు కోటమర్తి ఆద్రిత్‌. వయసు 9 ఏళ్లు. స్వతహాగా వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌. ధోనికి వీరాభిమాని. దుబాయ్‌లో స్వయంగా ధోని నెలకొల్పిన అకాడమీలోనే శిక్షణ పొందుతున్నాడు. తొలిసారి ధోని మ్యాచ్‌ను ‘లైవ్‌’గా చూసేందుకు వచ్చాడు. అయితే 3 బంతుల్లోనే తన ఆనందం ఆవిరి కావడంతో తనను తాను నియంత్రించుకోలేకపోయానన్నాడు!    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement