
యాసర్ డొగు స్మారక అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నమెంట్‌లో భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించాడు. టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరుగుతోన్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో 70 కేజీల సెమీ ఫైనల్ బౌట్‌లో బజరంగ్ ఇరాన్ రెజ్లర్ యూనస్ ఇమామిచోఘయ్‌పై గెలుపొందాడు. క్వార్టర్ ఫైనల్లో బజరంగ్ 15–4తో ముస్తఫా కాయా (టర్కీ)ను ఓడించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో ఆండ్రీ క్విటాయోస్కో (ఉక్రెయిన్)తో బజరంగ్ తలపడతాడు. భారత్‌కే చెందిన సందీప్ తోమర్ 61 కేజీల విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు.