ఇదేం నజరానా? | World Cup coach gelipincina Rs 25000? | Sakshi
Sakshi News home page

ఇదేం నజరానా?

Dec 23 2016 12:50 AM | Updated on Sep 4 2017 11:22 PM

ఇదేం నజరానా?

ఇదేం నజరానా?

ప్రపంచకప్‌ గెలిపించిన చీఫ్‌ కోచ్‌కు రూ. 25 వేలు, ఆటగాడికి రూ. 10 వేలు... ఇదేం నజరానానో అంతుచిక్కడం లేదు.

ప్రపంచ కప్‌ గెలిపించిన కోచ్‌కు రూ.25 వేలా!

న్యూఢిల్లీ: ప్రపంచకప్‌ గెలిపించిన చీఫ్‌ కోచ్‌కు రూ. 25 వేలు, ఆటగాడికి రూ. 10 వేలు... ఇదేం నజరానానో అంతుచిక్కడం లేదు. కానీ ఎయిరిండియా మాత్రం నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు... అన్న చందంగా ఘనంగా ప్రకటించింది. భారత్‌ ఆతిథ్యమిచ్చిన జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌లో టీమిండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో సంస్థ ఉద్యోగులైన చీఫ్‌ కోచ్‌ హరేంద్ర సింగ్‌కు రూ.25 వేలు, స్ట్రయికర్‌ అర్మాన్‌ ఖురేషీకి రూ. 10 ప్రోత్సాహక బహుమతి అందజేయనున్నట్లు  ఎయిరిండియా చైర్మన్‌ అశ్వని లోహని ప్రకటించారు. ఇంత తక్కువ మొత్తాన్ని అదో గొప్ప విషయమన్నట్టు ఆయన చెప్పుకోవడం విస్మయానికి గురిచేసింది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో రాణించిన యువ క్రికెటర్‌ జయంత్‌ యాదవ్‌ను గురువారం జరిగిన కార్యక్రమంలో సత్కరించారు. ఇతని తండ్రి ఎయిరిండియా ఉద్యోగి కావడంతో సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement