ఇరాన్ ఆశలు ఆవిరి | World Cup 2014: Bosnia Defeats Iran, 3-1 | Sakshi
Sakshi News home page

ఇరాన్ ఆశలు ఆవిరి

Jun 26 2014 1:50 AM | Updated on Oct 22 2018 5:58 PM

ప్రపంచకప్‌లో నాకౌట్‌కు చేరే అవకాశాన్ని ఇరాన్ మళ్లీ కోల్పోయింది. గ్రూప్ ‘ఎఫ్’లో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో బోస్నియా అండ్ హెర్జ్‌గోవినా చేతిలో 1-3తో ఓటమిపాలై నాలుగోసారి గ్రూప్ దశలోనే నిష్ర్కమించింది.

సాల్వడార్: ప్రపంచకప్‌లో నాకౌట్‌కు చేరే అవకాశాన్ని ఇరాన్ మళ్లీ కోల్పోయింది. గ్రూప్ ‘ఎఫ్’లో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో బోస్నియా అండ్ హెర్జ్‌గోవినా చేతిలో 1-3తో ఓటమిపాలై నాలుగోసారి గ్రూప్ దశలోనే నిష్ర్కమించింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే నైజీరియాతో సమానంగా పాయింట్లు (4) సాధించి నాకౌట్ బెర్తు కోసం పోటీపడే స్థితిలో మ్యాచ్‌ను ప్రారంభించిన ఇరాన్‌ను అదృష్టం వెక్కిరించింది. 23వ నిమిషంలో ఎడిన్ జెకో గోల్ చేసి బోస్నియాను ఆధిక్యంలో నిలిపాడు. ఆ తరువాత
 
 మిరాలెం జానిక్ 59వ నిమిషంలో మరో గోల్ చేశాడు. దాదాపు ఆశలు ఆవిరైన దశలో 82వ నిమిషంలో ఇరాన్‌కు రెజా తొలి గోల్‌ను అందించినా.. మరుసటి నిమిషంలోనే (83వ) సాజెవిక్ చేసిన గోల్‌తో బోస్నియా మరింత ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచినా... తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమితో మూడు పాయింట్లకే పరిమితమైన బోస్నియా కూడా ఇంటిదారి పట్టింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement