కేన్‌ విలియమ్సన్‌ వరల్డ్‌ రికార్డు

Williamson breaks Mahela Jayawardenes World Cup record - Sakshi

లండన్‌: న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ సరికొత్త వరల్డ్‌ రికార్డు సాధించాడు. ఒక వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్‌గా విలియమ్సన్‌ చరిత్ర సృష్టించాడు. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో తుది పోరులో విలియమ్సన్‌ ఈ ఫీట్‌ నమోదు చేశాడు.  ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో తన పరుగుల ఖాతాను  తెరవడం ద్వారా విలియమ్సన్‌ అత్యధిక పరుగులు సాధించిన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే శ్రీలంక మాజీ కెప్టెన్‌ మహేలా జయవర్థనే రికార్డును విలియమ్సన్‌ బ్రేక్‌ చేశాడు. 2007 వరల్డ్‌కప్‌లో జయవర్థనే 548 పరుగులు సాధించాడు. ఇదే ఇప్పటివరకూ వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్సీ రికార్డు. దాన్ని తాజాగా విలియమ్సన్‌ సవరిస్తూ నూతన అధ్యాయాన్ని లిఖించాడు.  2019 వరల్డ్‌కప్‌లో విలియమ్సన్‌ సాధించిన పరుగులు 578.

ఈ జాబితాలో విలియమ్సన్‌, జయవర్థనే తర్వాత స్థానాల్లో రికీ పాంటింగ్‌(539 పరుగులు, 2007), అరోన్‌ ఫించ్‌(507 పరుగులు, 2019), ఏబీ డివిలియర్స్‌( 482 పరుగులు, 2015)లు ఉన్నారు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ 465 పరుగులతో ఆరో స్థానంలో ఉన్నాడు. 2003 వరల్డ్‌కప్‌లో భారత్‌ ఫైనల్‌కు చేరే క్రమంలో గంగూలీ ఈ పరుగులు చేశాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top