అత్యధిక వైడ్లతో వరల్డ్‌ రికార్డు..!

West Indies, England bowlers bowl most number of wides in a Test match - Sakshi

సెయింట్‌ లూసియా: ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య బుధవారం ముగిసిన మూడో టెస్టులో ఓ చెత్త రికార్డు నమోదైంది. ఆ టెస్టు మ్యాచ్‌లో ఇరు జట్ల బౌలర్లు కలిపి మొత్తం 38 వైడ్లు విసిరారు. దాంతో దశాబ్దం క్రితం వెస్టిండీస్‌-ఆస్ట్రేలియా నమోదు చేసిన అత్యధిక వైడ్ల చెత్త రికార్డు బద్ధలైంది. 2008 జూన్‌లో బ్రిడ్జిటౌన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో విండిస్-ఆస్ట్రేలియన్ బౌలర్లు కలిపి మొత్తం 34 వైడ్లు విసిరారు. వైడ్ల రూపంలో ఎక్కువ ఎక్స్‌ట్రా పరుగులిచ్చిన రెండు టెస్టుల్లోనూ వెస్టిండీస్ బౌలర్లు భాగం కావడం విశేషం. 

తాజా మ్యాచ్‌లో భాగంగా నాల్గో రోజు ఆటలో వెస్టిండీస్‌ బౌలర్‌  కీమర్‌ రోచ్‌ వేసిన ఐదో ఐదో బంతిని వైడ్‌గా వేశాడు. అది రోచ్‌కు ఇన్నింగ్స్‌లో రెండో వైడ్‌. దాంతో గత వైడ్ల రికార్డు సమం అయ్యింది. ఆపై వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌ చేపట్టిన క్రమంలో ఇంగ్లండ్‌ బౌలర్‌ మార్క్‌ వుడ్‌ 14 ఓవర్‌లో వైడ్‌ వేశాడు. ఫలితంగా 35 వైడ్లతో చెత్త రికార్డును ఇరు జట్లు మూటగట్టుకున్నాయి. ఆ తర్వాత ఇంగ్లండ్‌ మరో మూడు వైడ్లు వేయడంతో మొత్తంగా 38 వైడ్లు పడ్డాయి. ఇక‍్కడ రెండు ఇన‍్నింగ్స్‌ల్లో కలిసి వెస్టిండీస్‌ 24 వైడ్లు వేయగా, ఇంగ్లండ్‌ 14 వైడ్‌ బాల్స్‌ సంధించింది. ఇక అత్యధిక వైడ్లు వేసిన జాబితాలో మూడో స్థానంలో దక్షిణాఫ్రికా-భారత్‌ జట్లు నిలిచాయి. గతేడాది జోహనెస్‌బర్గ్‌ వేదికగా జరిగిన టెస్టు ఇరు జట్లు 33 వైడ్లు విసిరాయి. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top