భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో తాము సుదీర్ఘ కాలం ఉండిపోయేందుకు రాలేదని క్రికెట్ పరిపాలకుల కమిటీ
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో తాము సుదీర్ఘ కాలం ఉండిపోయేందుకు రాలేదని క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) స్పష్టం చేసింది. బోర్డులో అన్ని వ్యవహారాలు చక్కబెట్టిన తర్వాత తాము తప్పుకుంటామని సీఏఓ చీఫ్ వినోద్ రాయ్ అన్నారు.
బహుశా వచ్చే అక్టోబర్ వరకు ఇది జరగవచ్చని, ఆ తర్వాత బోర్డులో కొత్త పాలక మండలి వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. సీఓఏ బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా రాయ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.