బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా జాఫర్‌

Wasim Jaffer appointed Bangladesh batting consultant - Sakshi

ఢాకా: ఈ ఏడాది మే నెలలో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు అకాడమీలో ఉన్న క్రికెటర్లకు శిక్షణ ఇచ్చేందుకు మాత్రమే నియమించబడ్డ భారత మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌కు తాజాగా ఆ దేశ క్రికెట్‌ హై పర్ఫామెన్స్‌ యూనిట్‌లోనూ చోటు కల్పించారు. వసీం జాఫర్‌ను బంగ్లాదేశ్‌ జాతీయ క్రికెట్‌ జట్టు బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా నియమిస్తూ ఆ దేశ క్రికెట్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది.  ఇప్పటివరకూ బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా పని చేసిన నీల్‌ మెకంజే స్థానంలో జాఫర్‌ను ఎంపిక చేసింది. త్వరలో శ్రీలంకలో పర్యటించనున్న బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టుకు జాఫర్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.

బౌలింగ్‌ కన్సల్టెంట్‌ చంపక రమననాయకేతో కలిసి జాఫర్‌ పని చేయనున్నాడు. ‘ కొన్ని వ్యక్తిగత వ్యవహారాల కారణంగా మెకంజీ బ్యాటింగ్‌ కోచ్‌గా అందుబాటులో ఉండటం లేదు. దాంతో జాఫర్‌ను బ్యాటింగ్‌ కోచ్‌గా ఎంపిక చేయాల్సి వచ్చింది. మేము ఎటువంటి కోచ్‌లను నియమించాలనే దానిపై మా వద్ద ప్రణాళికలు ఉన్నాయి. పరిస్థితుల్ని బట్టి వారి సేవల్ని ఉపయోగంచుకుంటాం. మెకంజీతో ఇంకా కాంట్రాక్ట్‌ ముగియ లేదు. అతనిక అదనపు బాధ్యతలు అప్పచెబుతాం’ అని బీసీబీ క్రికెట్‌ ఆపరేషన్స్‌ ఛైర్మన్‌ అక్రమ్‌ ఖాన్‌ తెలిపారు.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top