
మహేంద్ర సింగ్ ధోని(పాత ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : దాదాపు రెండేళ్ల తర్వాత పసుపు జెర్సీతో చెన్నై చెపాక్ స్టేడియంలో అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ మంగళవారం అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్ ప్రత్యర్థి జట్టు 17 సిక్సర్లు కొట్టగా.. చెన్నై జట్టు 14 సిక్సర్లు బాదింది.
అయితే మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు రస్సెల్ ఒక్కడే 17 సిక్సర్లలో 11 సిక్సర్లు బాదారు. అందులో కొన్ని సిక్సర్లకు బంతి స్టేడియం బయట పడ్డాయి. కీపర్‌గా వికెట్ల వెనుక ఉండి వీటిని తిలకించిన ధోని ప్రెజెంటేషన్ సమయంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
మ్యాచ్‌లో ఎక్కువ మొత్తంలో సిక్సర్లు నమోదయ్యాయని చెబుతూ బంతి స్టేడియం అవతల పడిన ప్రతిసారీ సిక్సర్‌కు ఆరుకు బదులు ఎనిమిది పరుగులు ఇస్తే బావుంటుందని జోక్ చేశారు.