వీవీఎస్‌ అత్యుత్తమ జట్టు ఇదే..

VS Laxman picks Indias best Test XI of the last 25 years - Sakshi

న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్ తన అత్యుత్తమ టెస్టు జట్టును ప్రకటించాడు. గత 25 ఏళ్లకు గాను భారత  అత్యుత్తమ టెస్టు జట్టును లక్ష్మణ్‌ తాజాగా ఎంపిక చేశాడు. ఇందులో సౌరవ్‌ గంగులీకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పిన లక్ష్మణ్‌.. ఎంఎస్‌ ధోని, విరాట్‌ కోహ్లిలకు చోటు కల్పించాడు. తన కలల టెస్టు జట్టులో వీరేంద్ర సెహ్వాగ్‌, మురళీ విజయ్‌లను ఓపెనర్లుగా ఎన్నుకున్నాడు. సౌరవ్‌ గంగూలీ కెప్టెన్సీలో అత్యధిక కాలం క్రికెట్‌ ఆడిన లక్ష్మణ్‌..మూడో స్థానాన్ని రాహుల్‌ ద్రవిడ్‌కు కట్టబెట్టాడు.

వీవీఎస్‌ అత్యుత్తమ భారత టెస్టు జట్టు ఇదే..

వీరేంద్ర సెహ్వాగ్‌, మురళీ విజయ్‌, రాహుల్‌ ద్రవిడ్‌, సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లి, సౌరవ్‌ గంగూలీ(కెప్టెన్‌), ఎంఎస్‌ ధోని(వికెట్‌ కీపర్‌), అనిల్‌ కుంబ్లే, భువనేశ్వర్‌ కుమార్‌, జవగళ్‌ శ్రీనాథ్‌, జహీర్‌ ఖాన్‌

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top