ఆనంద్‌కు ఎనిమిదో స్థానం | Viswanathan Anand was ranked eighth in the St. Lucia Open Blitz Chess Tournament. | Sakshi
Sakshi News home page

ఆనంద్‌కు ఎనిమిదో స్థానం

Aug 20 2017 1:35 AM | Updated on Jul 11 2019 6:22 PM

సెయింట్‌ లూసియా ఓపెన్‌ బ్లిట్జ్‌చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ ఎనిమిదో స్థానంలో నిలిచాడు.

న్యూఢిల్లీ:  సెయింట్‌ లూసియా ఓపెన్‌ బ్లిట్జ్‌చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య 18 రౌండ్‌ల పాటు అమెరికాలో జరిగిన ఈ టోర్నీలో ఆనంద్‌ ఒక గేమ్‌లో గెలిచి, 12 గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మిగతా ఐదు గేముల్లో ఓడిపోయాడు. రష్యా దిగ్గజం గ్యారీ కాస్పరోవ్‌ తొమ్మిది పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. 13.5 పాయింట్లతో సెర్గీ కర్జాకిన్‌ (రష్యా) టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement