ఆనంద్‌ వేసిన ఎత్తులు...

Viswanathan Anand Pens Inspirational Book - Sakshi

న్యూఢిల్లీ: భారత సూపర్‌ గ్రాండ్‌ మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ వేసే ఎత్తుకు పైఎత్తులు, విజయాలు, గెలుపోటములకు సంబంధించిన పోరాటాన్ని తెలుసుకునే అవకాశం వచ్చింది. ఆనంద్‌ తన అనుభవాలకు అక్షర రూపమిచ్చాడు. ఇదే పుస్తకంగా మార్కెట్లోకి రానుంది. ‘మైండ్‌మాస్టర్‌’– విన్నింగ్‌ లెసన్స్‌ ఫ్రమ్‌ ఎ చాంపియన్స్‌ లైఫ్‌ (విజేత జీవితంలోని  విజయ పాఠాలు) అనే పేరుతో డిసెంబర్‌ నెలలో మార్కెట్లోకి రానుంది.

అదే నెల 11న అధికారికంగా ‘మైండ్‌మాస్టర్‌’ పుస్తకాన్ని లాంఛనంగా విడుదల చేయనున్నట్లు పబ్లికేషన్‌ సంస్థ తెలిపింది. జర్నలిస్ట్‌ సుశాన్‌ నినన్‌కు తెలిపిన తన కెరీర్‌ అనుభవాలను ఆ విలేకరి అక్షరగ్రంథంగా మలచగా... దీన్ని హాచెట్‌ ఇండియా సంస్థ ముద్రించింది.     

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top