ఆనంద్‌కు ఏడో ‘డ్రా’ | Viswanathan Anand maintains lead after drawing with Shakhriyar Mamedyarov in Candidates Chess | Sakshi
Sakshi News home page

ఆనంద్‌కు ఏడో ‘డ్రా’

Mar 26 2014 12:53 AM | Updated on Sep 2 2017 5:09 AM

ఆనంద్‌కు ఏడో ‘డ్రా’

ఆనంద్‌కు ఏడో ‘డ్రా’

క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ అజేయ రికార్డు కొనసాగుతోంది. మమైదైరోవ్ (అజర్‌బైజాన్)తో మంగళవారం జరిగిన పదో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 30 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు.

ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ అజేయ రికార్డు కొనసాగుతోంది. మమైదైరోవ్ (అజర్‌బైజాన్)తో మంగళవారం జరిగిన పదో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 30 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఈ టోర్నీలో ఆనంద్‌కిది ఏడో ‘డ్రా’ కావడం విశేషం.
 
 మరో మూడు గేముల్లో నెగ్గిన ఈ ప్రపంచ మాజీ చాంపియన్ పదో రౌండ్ తర్వాత 6.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇతర గేముల్లో స్విద్లెర్ (రష్యా) 39 ఎత్తుల్లో క్రామ్నిక్ (రష్యా)ను ఓడిం చగా...  అరోనియన్ (అర్మేనియా), తొపలోవ్ (బల్గేరియా) గేమ్ 45 ఎత్తుల్లో; కర్జాకిన్ (రష్యా), ఆంద్రికిన్ (రష్యా) గేమ్ 29 ఎత్తుల్లో ‘డ్రా’ అయ్యాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement