డీన్‌ జోన్స్‌ తర్వాత కోహ్లినే.. | Virat Kohli touches career high 911 points | Sakshi
Sakshi News home page

డీన్‌ జోన్స్‌ తర్వాత కోహ్లినే..

Jul 19 2018 11:03 AM | Updated on Jul 19 2018 11:07 AM

Virat Kohli touches career high 911 points - Sakshi

తొలి వన్డేలో 75 పరుగులు చేసిన కోహ్లి.. రెండో వన్డే 45 పరుగులు సాధించాడు. ఇక మూడో వన్డేలో 71 పరుగులతో ఆకట్టుకున్నాడు.

దుబాయ్‌:  అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను టీమిండియా కోల్పోయినప్పటికీ కోహ్లి మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. తొలి వన్డేలో 75 పరుగులు చేసిన కోహ్లి.. రెండో వన్డే 45 పరుగులు సాధించాడు. ఇక మూడో వన్డేలో 71 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా రెండు రేటింగ్‌ పాయింట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క‍్రమంలోనే తన కెరీర్‌లోనే అత్యధికంగా 911 పాయింట్లను కోహ్లి సాధించాడు.

1991లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ డీన్‌ జోన్స్‌ (918) తర్వాత అత్యధిక పాయింట్లు సాధించిన క్రికెటర్‌ కోహ్లినే కావడం విశేషం. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో తొమ్మిది వికెట్లు పడగొట్టిన కుల్దీప్‌.. బౌలర్లలో 8 స్థానాలు ఎగబాకి కెరీర్‌లోనే అత్యుత్తమంగా ఆరో ర్యాంక్‌కు చేరుకున్నాడు. మరో స్పిన్నర్‌ చాహల్‌ 10వ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. బుమ్రా అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement