దుస్తుల యాడ్‌లో ’విరుష్క’

దుస్తుల యాడ్‌లో ’విరుష్క’

సాక్షి, హైదరాబాద్‌: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, బాలీవుడ్‌ నటి అనుష్కశర్మల ప్రేమాయణం అందరికి తెలిసిందే.  ప్రతి విషయాన్ని సోషల్‌ మీడియాలో తెలియజేస్తూ యాక్టివ్‌గా ఉంటుంది ఈ విరుష్కజంట. అయితే వారి వాణిజ్య ప్రకటనలైనా, వ్యకిగత విషయాలనైన సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకునే ఈ జంట ఓ విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. భారత్‌లో రాబోయే పండుగ సీజన్‌ల సందర్భంగా ఓ దుస్తుల కంపెనీ యాడ్‌లో విరుష్క జంట నటించింది.

 

ఈ విషయాన్నిఈ ఇద్దరూ రహస్యంగా ఉంచారు. ఫిల్మ్‌ఫేర్‌ తమ అధికారిక ఇన్‌స్టాగ్రమ్‌లో ‘ అనుష్కశర్మ, విరాట్‌ కోహ్లిలు ఇప్పుడే ఓ యాడ్‌లో నటించారు.’ అనే క్యాప్షన్‌తో ఓ ఫోటోను పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీరిద్దరూ తొలిసారి కలిసింది కూడా ఒక యాడ్‌ షూటింగ్‌లోనే.. 2013లో ఓ హేయిర్‌ షాంపో యాడ్‌లో వీరిద్దరూ తొలిసారి నటించారు. అనంతరం వీరిమధ్య ప్రేమ చిగురించింది.


 


#AnushkaSharma and #ViratKohli just shot for an ad together! #Virushka all the way baby ❤️


A post shared by Filmfare (@filmfare) on


Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top