కోహ్లి అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌..కానీ

Virat Kohli should take the blame on himself, says Gambhir - Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ విమర్శలు గుప్పించాడు.  వరుసగా ఆరు ఓటములతో డీలాపడ్డ ఆర్సీబీని టార్గెట్‌ చేసిన గంభీర్‌.. ఆ పరాజయాలకు బౌలర్లను కోహ్లి నిందించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించాడు. జట్టు ఓటమికి బౌలర్లపై నిందలు వేయవద్దని కోహ్లికి సూచించాడు. ఇందుకు కెప్టెన్‌గా కోహ్లినే బాధ్యత వహించాలన్నాడు.
(ఇక్కడ చదవండి: అందుకు కోహ్లి థ్యాంక్స్‌ చెప్పాలి : గంభీర్‌)

బ్యాట్స్‌మన్‌గా కోహ్లి ఒక మాస్టర్‌ అంటూనే కెప్టెన్‌గా మాత్రం అతను ఎప్పటికీ అప్రంటీసేనని మండిపడ్డాడు. ‘కోహ్లి అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ కావచ్చు.. కానీ అత్యుత్తమ కెప్టెన్‌ మాత్రం కాదు. కెప్టెన్సీలో కోహ్లి ఎప్పటికీ అప్రంటీసే. కేకేఆర్‌తో మ్యాచ్‌లో భాగంగా రసెల్‌ బ్యాటింగ్‌ చేసే క‍్రమంలో సిరాజ్‌ బీమర్లు వేయడంతో అతని స్థానంలో స్టోయినిస్‌ చేత బౌలింగ్‌ చేయించడం కోహ్లి చేసిన తప్పు. ఆ సమయంలో పవన్‌ నేగీని ఆప్షన్‌గా ఎంచుకుంటే బాగుండేది. పేస్‌ను బాగా ఆడే రసెల్‌కు స్పిన్‌తో ఎటాక్‌ చేయాల్సింది’ అని పేర్కొన్నాడు. కోహ్లి చేసిన తప్పిదంతోనే కేకేఆర్‌తో మ్యాచ్‌ను ఆర్సీబీ కోల్పోవల్సి వచ్చిందన్నాడు. ఇక్కడ కోహ్లి తనను విమర్శించుకోవడం మానేసి బౌలర్లపై నిందలు వేయడం సబబు కాదన్నాడు. అంతకుముందు కూడా కోహ్లిపై గంభీర్‌ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.ఇప్పటి వరకు ఐపీఎల్‌ టైటిల్‌ అందించకున్నాకెప్టెన్‌గా ఆర్సీబీ విరాట్‌ కోహ్లిపై నమ్మకం ఉంచిందని, అందుకు అతను సదరు ఫ్రాంచైజీకి కృతజ్ఞతలు తెలపాలన్నాడు.
(ఇక్కడ చదవండి: గంభీర్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చిన కోహ్లి)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top