ఆ బౌలర్‌ నన్నొక మూర్ఖుడిలా చూశాడు: కోహ్లి | Virat Kohli Revealed An Incident When He Had Facing Shane Warne | Sakshi
Sakshi News home page

మాటలతో జవాబివ్వకు అన్నాడు: కోహ్లి

May 19 2020 10:27 AM | Updated on May 19 2020 10:32 AM

Virat Kohli Revealed An Incident When He Had Facing Shane Warne - Sakshi

హైదరాబాద్‌ : టీమిండియా సారథి, పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లి ఎంతో మంది ప్రత్యర్థి బౌలర్లకు నిద్రలేని రాత్రులను మిగిల్చాడని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో అరవీరభయంకర బౌలర్లుగా పేరుగాంచిన వారి బౌలింగ్‌ను చీల్చిచెండాడి పరుగుల వరద పారించాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులు, ఘనతలు అందుకొని ప్రపంచంమొత్తం ప్రశంసించే స్థాయికి కోహ్లి ఎదిగాడు. అయితే తన కెరీర్‌ ఆరంభంలో కొన్ని అవమానాలను ఎదుర్కొన్నానని తాజాగా ఓ కార్యక్రమంలో కోహ్లి పేర్కొన్నాడు. 

‘అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియా స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ బౌలింగ్‌ను నేను ఎదుర్కొలేదు. కానీ ఐపీఎల్‌లో అతడి బౌలింగ్‌లో ఆడే అవకాశం దక్కింది. అయితే ఐపీఎల్‌ 2009లో నన్నొక మూర్ఖుడిలా వార్న్‌ చూసినా అంతగా పట్టించుకోలేదు. ఇక 2011లో మరోసారి వార్న్‌ను ఎదుర్కొవాల్సి వచ్చింది. అయితే అప్పుడు ఎలాంటి అనూహ్య సంఘటనలేమీ జరగలేదు. ఎందుకటే అతడు (వార్న్‌) నన్ను ఔట్‌ చేయలేదు. నేను అతడి బౌలింగ్‌ను చితక్కొట్టలేదు. ఇక ఓ మ్యాచ్‌ సందర్భంగా వార్న్‌ నా దగ్గరకు వచ్చి మాటలతో జవాబు ఇవ్వకు అని చెప్పాడు. కానీ నేనేమీ ఆ సూచనను పట్టించుకోలేదు’ అంటూ కోహ్లి సరదాగా పేర్కొన్నాడు. ఇక గతంలో షేన్‌ వార్న్‌ సైతం కోహ్లిని ఎలా ఔట్‌ చేయాలో, ఇబ్బందులకు గురిచేయొచ్చో యువ బౌలర్లకు సూచించిన విషయం తెలిసిందే.  

చదవండి:
పాంటింగే అత్యుత్తమ కోచ్‌: భారత బౌలర్‌
‘కశ్మీర్‌ గురించి పట్టించుకోవడం మానేయ్‌’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement