విరాట్కు మళ్లీ నెంబర్ వన్ ర్యాంక్ | Virat Kohli reclaims number one ODI batting ranking | Sakshi
Sakshi News home page

విరాట్కు మళ్లీ నెంబర్ వన్ ర్యాంక్

Mar 9 2014 4:55 PM | Updated on May 29 2019 2:49 PM

విరాట్కు మళ్లీ నెంబర్ వన్ ర్యాంక్ - Sakshi

విరాట్కు మళ్లీ నెంబర్ వన్ ర్యాంక్

భారత యువ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో మళ్లీ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు.

దుబాయ్: భారత యువ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో మళ్లీ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. శనివారం విడుదల చేసిన తాజా బ్యాట్స్మెన్ జాబితాలో కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. గత జనవరిలో చేజార్చుకున్న అగ్రపీఠాన్ని.. ఆసియా కప్లో రాణించడం ద్వారా మళ్లీ సొంతం చేసుకున్నాడు.

ఆసియా కప్కు ముందు విరాట్.. దక్షిణాఫ్రికా కెప్టెన్ డివిల్లీర్స్ కంటే రెండు రేటింగ్ పాయింట్లు వెనకబడి రెండో స్థానంలో ఉన్నాడు. ఈ టోర్నీలో రాణించడం ద్వారా విరాట్ డివిల్లీర్స్ను వెనక్కినెట్టి నెంబర్ వన్గా నిలిచాడు. బంగ్లాదేశ్పై (136) సెంచరీ నమోదు చేసిన కోహ్లీ.. మూడు మ్యాచ్ల్లో కలిపి 189 పరుగులు చేశాడు. కాగా ఆఫ్ఘనిస్థాన్పై బ్యాటింగ్కు దిగలేదు. ప్రస్తుత జాబితాలో డివిల్లీర్స్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇతర భారత ఆటగాళ్లలో శిఖర్ ధవన్ మూడు, రోహిత్ శర్మ ఒకటి, రవీంద్ర జడేజా 12 స్థానాలు ఎగబాకి వరసగా 8, 22, 50వ ర్యాంక్లు సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement