'పీటర్సన్‌.. రిటైర్మెంట్‌ తర్వాత వస్తా' | Virat Kohli Reacts To Kevin Pietersen Comments About Work Out Video | Sakshi
Sakshi News home page

'పీటర్సన్‌.. రిటైర్మెంట్‌ తర్వాత వస్తా'

Jul 4 2020 3:37 PM | Updated on Jul 4 2020 3:56 PM

Virat Kohli Reacts To Kevin Pietersen Comments About Work Out Video - Sakshi

ముంబై : టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌ కాపాడుకోవడంలో ఎంత ముందుంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంతకుముందు కూడా కోహ్లి ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలను ట్విటర్‌లో షేర్‌ చేశాడు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో ఆటకు కూడా విరామం దొరకడంతో కోహ్లి ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి సారించాడు. తాజాగా వెయిట్‌లిప్టింగ్‌ చేస్తున్న వీడియో ఒకటి కోహ్లి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. (కోహ్లితో పోల్చొద్దు: పాక్‌ కెప్టెన్‌ బాబర్‌)

'నేను రోజూ ఎక్సర్‌సైజ్‌లు చేయాలనుకున్నప్పుడు వెయిట్‌లిఫ్టింగ్‌ పుషప్‌ను తప్పకుండా ఉంచుకుంటా. ఎందుకంటే అది నా ఫేవరెట్‌. నాలో ఎంత పవర్‌ ఉందనేది బయటపెడుతుంది. అందుకే ఈ వర్కవుట్‌ను బాగా ఇష్టపడుతా' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. ఈ వీడియో చూసిన తర్వాత ఇంగ్లండ్‌ మాజీ ఆల్‌రౌండ్‌ర్‌ కెవిన్‌ పీటర్సన్‌ కోహ్లిపై సరదాగా కామెంట్‌ చేశాడు. ' ఏయ్‌ కోహ్లి.. బైక్‌పై వచ్చేయ్‌.. ఇద్దరం కలిసి చేద్దాం' అంటూ పేర్కొన్నాడు. దీనికి కోహ్లి.. తప్పకుండా.. కానీ రిటైర్మెంట్‌ తర్వాత వస్తా అంటూ సరదాగా పేర్కొన్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement