కోహ్లి, బుమ్రాలకు షాక్‌

Virat Kohli Loses Top Spot in ICC Test Player Rankings - Sakshi

దుబాయ్‌: న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌ మ్యాచ్‌లో విఫలమైన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి షాక్‌ తగిలింది. టెస్ట్‌ బ్యాట్సమన్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌ నుంచి రెండో స్థానానికి పడిపోయాడు. నిలకడగా రాణిస్తున్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో 911 పాయింట్లతో స్మిత్‌ టాప్‌కు చేరాడు. 906 పాయింట్లతో కోహ్లి రెండో ర్యాంక్‌లో నిలిచాడు. కివీస్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ ఒక స్థానం మెరుగుపరుచుకుని మూడో ర్యాంక్‌కు ఎగబాకాడు.

ఆసీస్‌ బ్యాటింగ్‌ సంచలనం మార్నస్‌ లబుషేన్‌ ఒక స్థానం పడిపోయి 4వ ర్యాంకు దక్కించుకున్నాడు. పాకిస్తాన్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ ఆజామ్‌ ఐదో ర్యాంకులో ఉన్నాడు. కోహ్లితో సహా నలుగురు టీమిండియా ఆటగాళ్లు అజింక్య రహానే(8), చతేశ్వర్‌(9), మయాంక్‌ అగర్వాల్‌(10) టాప్‌-10లో ఉండటం విశేషం. డేవిడ్‌ వార్నర్‌ 6, జోయ్‌ రూట్‌ 7 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. న్యూజిలాండ్‌ పర్యటనలో కోహ్లి దారుణంగా విఫలమయ్యాడు. కివీస్‌ జరిగిన తొలి టెస్ట్‌లో కేవలం 21 పరుగులు మాత్రమే సాధించి నిరాశపరిచాడు. (చదవండి: 19 ఇన్నింగ్స్‌ల్లో ‘జీరో’..!)

టాప్‌టెన్‌ నుంచి బుమ్రా ఔట్‌
బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా బౌలర్‌ పాట్‌ కమిన్స్‌ అగ్ర స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో మొదటి టెస్ట్‌లో ఘోరంగా విఫలమైన టీమిండియా ప్రధాన జస్‌ప్రీత్‌ బుమ్రా టాప్‌ -10 నుంచి కిందకు పడిపోయాడు. ఇండియా నుంచి రవిచంద్రన్‌ అశ్విన్‌ ఒక్కడే టాప్‌టెన్‌లో ఉన్నాడు. అతడు 9వ ర్యాంకు దక్కించున్నాడు. (చదవండి: ఇలా ఆడితే ఎలా..!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top