అతడు ఓ మెషిన్లా బ్యాటింగ్ చేస్తాడు | Virat Kohli is Playing Like a Machine, Says Adam Zampa | Sakshi
Sakshi News home page

అతడు ఓ మెషిన్లా బ్యాటింగ్ చేస్తాడు

May 8 2016 12:31 PM | Updated on Sep 3 2017 11:41 PM

అతడు ఓ మెషిన్లా బ్యాటింగ్ చేస్తాడు

అతడు ఓ మెషిన్లా బ్యాటింగ్ చేస్తాడు

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీపై రైజింగ్ పుణె సూపర్జెయింట్స్ బౌలర్ ఆడం జెంపా ప్రశంసలు కురిపించాడు.

బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీపై రైజింగ్ పుణె సూపర్జెయింట్స్ బౌలర్ ఆడం జెంపా ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ ఓ మెషిన్ బ్యాటింగ్ చేస్తాడంటూ కితాబిచ్చాడు. అతనిలో ప్రత్యేక నైపుణ్యం ఉందని అన్నాడు. పుణెలో శనివారం జరిగిన మ్యాచ్లో కోహ్లీ అజేయ సెంచరీ చేసి జట్టును గెలిపించిన సంగతి తెలిసిందే.

'కోహ్లీ బ్యాటింగ్ ఓ మెషిన్లా ఉంటుంది. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడాలని చూడడు. కొంత సమయం తీసుకుంటాడు. క్రీజులో కుదురుకున్నాక దూకుడు పెంచుతాడు. బెంగళూరులో మ్యాచ్లో విరాట్ అద్భుతంగా ఆడాడు' అని జెంపా అన్నాడు. బెంగళూరు స్టేడియంలో ఆడిన అనుభవం తనకుందని, ప్రపంచ కప్లో ఆస్ట్రేలియా తరపున ఆడానని చెప్పాడు. ఇక్కడి వాతావరణం అద్భుతంగా ఉందని అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement