కోహ్లి ట్వీట్‌ రికార్డు | Virat Kohli Birthday Wish For MS Dhoni Was 2019 Favourite Tweet For Sports Field | Sakshi
Sakshi News home page

కోహ్లి ట్వీట్‌ రికార్డు

Dec 11 2019 4:40 AM | Updated on Dec 11 2019 4:40 AM

Virat Kohli Birthday Wish For MS Dhoni Was 2019 Favourite Tweet For Sports Field - Sakshi

న్యూఢిల్లీ: భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి బ్యాట్‌తో మైదానంలో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. తాజాగా అతను బ్యాట్‌తో కాకుండా ట్వీట్‌తోనూ రికార్డులకెక్కాడు. అది కూడా తన స్ఫూర్తి ప్రదాత, మాజీ కెప్టెన్‌ ధోనికి చెప్పిన పుట్టిన రోజు శుభాకాంక్షల ద్వారా కావడం మరో విశేషం. ఈ ఏడాది తన అభిమాన కెప్టెన్‌ జన్మదినోత్సవం సందర్భంగా కోహ్లి ‘హ్యాపీ బర్త్‌ డే మహి భాయ్‌. చాలా కొద్దిమందికే నమ్మకానికి అర్థం తెలుసు. మీ నుంచి ఆ నమ్మకాన్ని పొందిన నేను అదృష్టవంతుణ్ని. మీ సహచర్యంలో నేను ఎన్నో ఏళ్లు నడిచాను. నా వరకైతే మీరే నాకు పెద్దన్న. నేనెపుడు చెప్పినట్లుగా ఎప్పటికీ నీవే నా సారథివి’ అని ట్వీట్‌ చేశాడు. ఇది సోషల్‌ మీడియాలో ప్రత్యేకించి స్పోర్ట్స్‌ విభాగంలో అత్యధికంగా రీట్వీట్‌ (45,500 సార్లు) అయిన పోస్ట్‌గా రికార్డుకెక్కిందని ట్విట్టర్‌ మంగళవారం వెల్లడించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement