'టీమిండియా బ్యాటింగ్ కష్టాలు తొలగాలంటే..' | Virat Kohli at No.3 Will Solve India's Batting Problems: Sunil Gavaskar | Sakshi
Sakshi News home page

'టీమిండియా బ్యాటింగ్ కష్టాలు తొలగాలంటే..'

Aug 22 2015 8:23 PM | Updated on Sep 3 2017 7:56 AM

టెస్టు క్రికెట్లో టీమిండియా బ్యాటింగ్ కష్టాలు తొలగాలంటే కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగాలని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సూచించాడు.

టెస్టు క్రికెట్లో టీమిండియా బ్యాటింగ్ కష్టాలు తొలగాలంటే కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగాలని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సూచించాడు. బ్యాటింగ్ ఆర్డర్లో మూడోస్థానంలో వస్తున్న రహానె రాణిస్తున్నాడని, అయితే కోహ్లీ వన్ డౌన్లో వస్తే భారత్ బ్యాటింగ్ కష్టాలన్నీతొలగిపోతాయని చెప్పాడు.

బ్యాటింగ్ ఆర్డర్లో కోహ్లీ తర్వాత రహానె, రోహిత్ శర్మ ఆడితే మంచిదని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ విజయం సాధించాలంటే.. మ్యాచ్ నాలుగో రోజు ఆదివారం దూకుడుగా ఆడి టీ సమయానికి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయాలని సూచించాడు. తద్వారా లంకను ఆలౌట్ చేసేందుకు భారత బౌలర్లకు తగిన సమయం ఇవ్వాలని సన్నీ చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement