
జహీర్‌ఖాన్ ఐపీఎల్ ‘సెంచరీ’
రెండేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సీనియర్ క్రికెటర్ జహీర్‌ఖాన్ బౌలింగ్‌లో పదును ఏమాత్రం తగ్గలేదు.
ఢిల్లీ: రెండేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సీనియర్ క్రికెటర్ జహీర్‌ఖాన్ బౌలింగ్‌లో పదును ఏమాత్రం తగ్గలేదు. 38 ఏళ్ల వయసులోనూ సత్తా చాటుతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో వంద వికెట్లు పడగొట్టి మరోసారి మెరిశాడు. ఫిరోషా కోట్లా మైదానంలో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్ల మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో అతడీ ఘనత సాధించాడు. అజింక్య రహానేను క్లీన్‌బౌల్డ్ చేసి ఐపీఎల్ వందో వికెట్ మైలురాయిని చేరుకున్నాడు.
ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన పదో బౌలర్‌గా, 8వ భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో 10 మ్యాచుల్లో 10 వికెట్లు పడగొట్టాడు. లలిత్ మలింగ(152), అమిత్ మిశ్రా(134), హర్భజన్ సింగ్(127), పియూష్ చావ్లా(123), డ్వేన్ బ్రావొ(122), భువనేశ్వర్ కుమార్(108), ఆశిష్ నెహ్రా(106), వినయ్ కుమార్(101), రవిచంద్రన్ అశ్విన్(100) ఇంతకుముందు ఐపీఎల్‌లో 100 వికెట్ల మైలు రాయిని అందుకున్నారు.
92 టెస్టులు ఆడిన జహీర్‌ఖాన్ 32.94 సగటుతో 311 వికెట్లు పడగొట్టాడు. 200 వన్డేలు ఆడి 282 వికెట్లు తీశాడు. 17 టి20ల్లో 17 వికెట్లు దక్కించుకున్నాడు.