
ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలతో మెరిసిన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ పొగాట్ సీజన్‌ను మరో స్వర్ణంతో ముగించింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో 57 కేజీల విభాగంలో వినేశ్ చాంపియన్‌గా నిలిచింది.
మోచేతి గాయం నుంచి కోలుకొని బరిలో దిగిన వినేశ్ మొత్తం టోర్నీలో ప్రత్యర్థులకు కేవలం 2 పాయింట్లు మాత్రమే సమర్పించుకుంది. ఫైనల్లో వినేశ్ 10–0తో బబితను మట్టి కరిపించింది. ఆమె గతంలో 2012 నుంచి 16 వరకు వరుసగా ఐదుసార్లు ఈ విభాగంలో చాంపియన్‌గా నిలవడం విశేషం.