ప్రొఫెషనల్‌ సర్క్యూట్‌లో బాక్సర్‌ వికాస్‌ శుభారంభం  | Vikas Krishan starts professional circuit with a win | Sakshi
Sakshi News home page

ప్రొఫెషనల్‌ సర్క్యూట్‌లో బాక్సర్‌ వికాస్‌ శుభారంభం 

Jan 20 2019 2:08 AM | Updated on Jan 20 2019 2:08 AM

Vikas Krishan starts professional circuit with a win - Sakshi

భారత బాక్సర్‌ వికాస్‌ క్రిషన్‌కు ప్రొఫెషనల్‌ సర్క్యూట్‌లో శుభారంభం లభించింది. న్యూయార్క్‌లో జరిగిన తన తొలి బౌట్‌లో వికాస్‌... స్టీవెన్‌ అండ్రడే (అమెరికా)పై గెలుపొందాడు. విఖ్యాత బాక్సింగ్‌ ప్రమోటర్‌ బాబ్‌ అరుమ్‌కు చెందిన ‘టాప్‌ ర్యాంక్‌ ప్రమోషన్స్‌’తో ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్న భారత బాక్సర్‌ వెల్టర్‌వెయిట్‌ కేటగిరీతో ప్రొఫెషనల్‌ కెరీర్‌ మొదలుపెట్టాడు.  ఆరు రౌండ్ల ఈ బౌట్‌ కేవలం రెండు రౌండ్లలోనే ముగిసింది. నిర్వాహకులు వికాస్‌ ప్రత్యర్థి అండ్రడే సాంకేతికంగా నాకౌట్‌ అయినట్లు ప్రకటించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement