వీణా మాధురి ‘డబుల్’ | Veena Madhuri 'double' | Sakshi
Sakshi News home page

వీణా మాధురి ‘డబుల్’

Sep 14 2013 11:56 PM | Updated on Sep 1 2017 10:43 PM

వీణా మాధురి స్ప్రింట్‌లో మెరిసింది. హైదరాబాద్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ అండర్-16 బాలికల ఈవెంట్‌లో ఆమె 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందెంలో విజేతగా నిలిచింది.

సాక్షి, హైదరాబాద్: వీణా మాధురి స్ప్రింట్‌లో మెరిసింది. హైదరాబాద్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ అండర్-16 బాలికల ఈవెంట్‌లో ఆమె 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందెంలో విజేతగా నిలిచింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో శనివారం జరిగిన ఈ పోటీల్లో వీణ వంద మీటర్ల పరుగును 14.2 సెకన్లలో పూర్తి చేసింది. హఫీజా, అష్టలక్ష్మి వరుసగా రజత, కాంస్య పతకాలు గెలిచారు. 200 మీ. పరుగును వీణ 30.8 సెకన్లలో పూర్తి చేసి బంగారు పతకం నెగ్గింది. తేజస్వి రజతం, యోషిత కాంస్యం చేజిక్కించుకున్నారు.
 
 ఇతర పోటీల ఫలితాలు
 అండర్-14 బాలురు: 100 మీ. పరుగు: 1. శివమ్ (11.8 సె.), 2. సందీప్, 3. వంశీకృష్ణ; 600 మీ.: 1. కల్యాణ్ (1:38.1 సె.), 2. శ్రీధర్, 3. రాజురెడ్డి; లాంగ్‌జంప్: 1. శరత్ (5.65 మీ.), 2. రాము, 3. అఫ్సర్; హైజంప్: 1. మయాంక్ (1.30 మీ.), 2. కలింగ్, 3. సాయి గణేశ్; షాట్‌పుట్: 1. రవి నాయక్ (9.50 మీ.), 2. ఉన్నీస్, 3. కాశీమ్; బాలికలు: 100 మీ.: 1. మంజుల (14.2 సె.), 2. సాచిక, 3. తేజస్విని; 600 మీ.: 1. సుమలత (2:02.8 సె.), 2. ఏంజిల్, 3. శశిప్రియా; లాంగ్‌జంప్: 1. సాచిక (4.17 మీ.), 2. తేజస్వి, 3. నిత్య; షాట్‌పుట్: 1. చక్రిక (6.30 మీ.), సునైన, 3. మాధురి; అండర్-16 బాలురు: 100 మీ.: 1.మహేందర్ (11.7 సె.), 2. డిమెద్, 3. సలామ్; 200 మీ.: 1. మహేందర్ (23.9 సె.), 2. సలామ్, 3. రాజు; 400 మీ.: 1.సంతోష్ రెడ్డి (55.5 సె.), 2. అఖిల్, 3. హేమంత్; 800 మీ.: 1. అనీష్ కుమార్ (2:12.3 సె.), 2. నితిశ్, 3. మహేశ్; 1000 మీ.: 1. రాకేశ్ (3:05.9 సె.), 2. విక్రమ్, 3.రితేశ్; షాట్‌పుట్: 1. నవీన్ (9.42 మీ.), 2. జోయెల్, 3. నాగరాజు; డిస్కస్ త్రో: 1. సాయి శ్రీరామ్ (31.40 మీ.), 2. ప్రసాద్, 3. ముదిత్; లాంగ్‌జంప్: 1. విజయ్ (5.98 మీ.), 2. డిమెద్ నెగి, 3. రోషన్; హైజంప్: 1. స్వరూప్ (1.55 మీ.), 2. మధుబాబు, 3. విజయ్; ట్రిపుల్ జంప్: 1. విజయ్ (12.48), 2. అనిశ్, 3. రామ్‌మోహన్; బాలికలు: 400 మీ.: 1. రమ్య (1:16.1 సె.), 2. నికిత, 3. అనుపమ; 800 మీ.: 1. సంగీత (3:03.7 సె.), 2. షణ్ముఖ, 3. ఇస్రత్; డిస్కస్ త్రో: 1. విజేత (19.06 మీ.), 2. శ్రీజ, 3. అమాతుల్లా; లాంగ్‌జంప్: 1. అష్టలక్ష్మి (4.02 మీ.), శ్రీజ, 3. మేరి దివ్య; షాట్‌పుట్: 1. ఇతికా బారిక్ (7.16 మీ.), 2. శ్రీజ, 3. అమాతుల్లా.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement