
ముక్కోణపు సిరీస్: ఫోర్ కొట్టకుండానే నాలుగు పరుగులు
భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో భారత్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ ఒకే బంతికి నాలుగు పరుగులు తీశారు.
మెల్బోర్న్: ముక్కోణపు సిరీస్ రెండో వన్డేలో ఓ అరుదైన ఘటన జరిగింది. భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో భారత్ బ్యాట్స్ మేన్ రోహిత్ శర్మ ఒకే బంతికి నాలుగు పరుగులు తీశారు. అంటే రోహిత్ ఫోర్ కొట్టలేదు. అదెలా అంటారా.. కమ్మిన్స్ వేసిన నాలుగో ఓవర్ ఆరో బంతికి రోహిత్ ఫోర్ కొట్టకుండానే రహానేతో కలిసి నాలుగు పరుగులు తీశారు. 5 ఓవర్లు ముగిసే సరికి జట్టు స్కోరు 29/1. రోహిత్(12), రహానే(12) లు క్రీజులో ఉన్నారు.
ఆసీస్ లాంటి కట్టుదిట్టమైన జట్టుతో ఇలాంటి ఫీట్ సాధించటం విశేషం. రోహిత్, రహానేలు వేగంగా పరుగులు తీసి ఇది సాధించారు. ఒక బంతికి ఒక పరుగు తీయటమే ఒక్కోసారి కష్టం. అలాంటిది ఒకే బంతికి ఫోర్ కొట్టకుండానే నాలుగు పరుగులు చేశారు ఈ యువ బ్యాట్స్ మెన్ లు.