విజయ్‌ శంకర్‌కు గాయం!

Today match the India Practice with New Zealand - Sakshi

నేడు న్యూజిలాండ్‌తో భారత్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌

రాహుల్‌పై ప్రత్యేక దృష్టి

లండన్‌: ప్రపంచ కప్‌ సమరాంగణంలో తొలి సన్నాహకానికి భారత్‌ సిద్ధమైంది. ఓవల్‌ మైదానంలో నేడు జరిగే తమ మొదటి ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో కోహ్లి సేన తలపడుతుంది. కొన్నాళ్ల క్రితం న్యూజిలాండ్‌ గడ్డపై జరిగిన వన్డే సిరీస్‌లో ఈ రెండు టీమ్‌లు ఆడాయి. మ్యాచ్‌ ఫలితం టోర్నీపై ఎలాంటి ప్రభావం చూపకున్నా... తాజా వరల్డ్‌ కప్‌ ఫార్మాట్‌లో అన్ని టీమ్‌లతో ఆడే అవకాశం ఉండటంతో ఇరు జట్లకు కూడా ప్రత్యర్థి బలాబలాలపై అవగాహనకు ఈ మ్యాచ్‌ ఉపకరిస్తుంది.

ఈ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ను 15 మంది ఆటగాళ్లు (మ్యాచ్‌లో 11 మంది బ్యాటింగ్, 11 మంది బౌలింగ్‌ చేయవచ్చు) కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని భారత్‌ భావిస్తోంది. అందుకే ఎవరికీ విశ్రాంతినివ్వకుండా బ్యాట్స్‌మెన్, బౌలర్లు అందరినీ పరీక్షించే అవకాశం ఉంది. ముఖ్యంగా నాలుగో స్థానంలో తీవ్ర చర్చ సాగిన నేపథ్యంలో దానిపై కూడా టీమ్‌ మేనేజ్‌మెంట్‌ దృష్టి పెట్టనుంది.   

కేదార్‌ ప్రాక్టీస్‌ ...
ప్రాక్టీస్‌ మ్యాచ్‌కు ముందు రోజు భారత జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది. నెట్స్‌లో సాధన చేస్తున్న సమయంలో ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ కుడి చేతికి గాయమైంది. పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ వేసిన బంతిని పుల్‌ చేసే క్రమంలో శంకర్‌ దెబ్బ తగిలించుకున్నాడు. నొప్పితో విలవిల్లాడిన అతను వెంటనే డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లిపోయాడు. అనంతరం గాయాన్ని నిర్ధారించిన టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అతడికి స్కానింగ్‌ చేయించాల్సి ఉందని ప్రకటించింది. మరో వైపు గాయంనుంచి కోలుకుంటున్న కేదార్‌ జాదవ్‌ కూడా రెండు రోజుల పాటు స్వల్పంగా ప్రాక్టీస్‌ చేశాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top