భాగ్యనగరంలో ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త. నగరంలో 12 నుంచి 20 వరకు జరిగే నాలుగు సన్‌రైజర్స్ మ్యాచ్‌లకు టిక్కెట్ల అమ్మకాలు మంగళవారం మొద లయ్యాయి.
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త. నగరంలో 12 నుంచి 20 వరకు జరిగే నాలుగు సన్‌రైజర్స్ మ్యాచ్‌లకు టిక్కెట్ల అమ్మకాలు మంగళవారం మొద లయ్యాయి. సన్‌రైజర్స్ జట్టు ఈ నెల 12న ముంబై ఇండియన్స్ (రా. గం. 8.00 నుంచి)తో, 14న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (సా. గం. 4.00 నుంచి)తో, 18న కోల్‌కతా నైట్‌రైడర్స్ (రా. గం. 8.00 నుంచి)తో, 20న బెంగళూరు రాయల్ చాలెంజర్స్ (సా. గం. 4.00 నుంచి)తో తలపడనుంది. ఈ నాలుగు మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లు హైదరాబాద్ జింఖానా స్టేడియంలోని కౌంటర్‌లో అందుబాటులో ఉన్నాయి. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు టికెట్లు కొనుక్కోవచ్చు.
అలాగే ఫిల్మ్‌నగర్, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్, సింధి కాలనీ, దిల్‌షుక్‌నగర్, హిమాయత్‌నగర్‌లోని ‘కేఫ్ కాఫీ డే’ అవుట్‌లెట్ల నుంచి టికెట్లు కొనుక్కోవచ్చు. బంజారాహిల్స్, క్లాక్‌టవర్, కూకట్‌పల్లి 2, హైదర్‌నగర్, మాదాపూర్, బోయిన్‌పల్లి, మైత్రివనంలోని ఎంపిక చేసిన ‘మొబైల్ స్టోర్’ అవుట్‌లెట్లలో కూడా టికెట్లను అమ్ముతున్నారు. ఇక ఆన్‌లైన్‌లో ఠీఠీఠీ. ఛౌౌజుఝడటజిౌఠీ.ఛిౌఝ అనే వెబ్‌సైట్‌లోనూ టికెట్లు అందుబాటులో ఉన్నాయి.