ఆరో స్థానంలో హరికృష్ణ | the sixth place Hari Krishna | Sakshi
Sakshi News home page

ఆరో స్థానంలో హరికృష్ణ

Mar 3 2016 12:17 AM | Updated on Aug 29 2018 1:16 PM

ఆరో స్థానంలో హరికృష్ణ - Sakshi

ఆరో స్థానంలో హరికృష్ణ

ఇంటర్నేషనల్ మైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ (ఐఎంఎస్‌ఏ) ఎలైట్ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ .....

 హుఅయాన్ (చైనా):  ఇంటర్నేషనల్ మైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ (ఐఎంఎస్‌ఏ) ఎలైట్ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ బాస్‌క్యూ (ఏకకాలంలో రెండు గేమ్‌లు ఆడటం) ఈవెంట్‌లో ఆరు గేమ్‌లు ముగిశాక 3.5 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నాడు. హరికృష్ణ రెండు గేముల్లో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయాడు. మహిళల బాస్‌క్యూ ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మూడు పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. గురువారం మరో నాలుగు గేమ్‌లు జరుగుతాయి.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement