సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా యౌరాజ్ | The chairman of the senior selection committee yauraj | Sakshi
Sakshi News home page

సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా యౌరాజ్

Jul 31 2014 11:52 PM | Updated on Sep 2 2017 11:10 AM

హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) 2014-15 సీజన్‌కు పలు సెలక్షన్ కమిటీలకు చైర్మన్లను, వివిధ జట్లకు కోచ్‌లను నియమించింది.

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) 2014-15 సీజన్‌కు  పలు సెలక్షన్ కమిటీలకు చైర్మన్లను, వివిధ జట్లకు కోచ్‌లను నియమించింది. సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా యౌరాజ్ సింగ్ వ్యవహరిస్తారు. ఎన్.పి. సింగ్, సి. జయ్‌కుమార్, అరవింద్ శెట్టిలను ఈ కమిటీ సభ్యులుగా హెచ్‌సీఏ నామినేట్ చేసింది.

జూనియర్ సెలక్షన్ కమిటీకి జె. శివాజి యాదవ్ చైర్మన్ కాగా, మహ్మద్ ఇఫ్తెకారుద్దీన్, పి. విజయ్ కుమార్, ఇమ్రాన్ మహమూద్ ఇతర సభ్యులు. సబ్ జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా కిరణ్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించగా, జి. మనోహర్ రెడ్డి, వినోద్ మఖిజా, టి.కె. నాగరాజు కమిటీ సభ్యులుగా నామినేట్ అయ్యారు. ఇక హైదరాబాద్ ‘ఎ’ జట్టు కోచ్‌గా పి.రమేశ్ కుమార్, అండర్-19 జట్టు కోచ్‌గా విద్యుత్ జైసింహ, అండర్-16 జట్టు కోచ్‌గా చేతన్ ఆనంద్, అండర్-14 జట్టు కోచ్‌గా తిమోతి రవికుమార్ నియమితులయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement