టెన్నిస్ చాంప్స్ అయూబ్, శ్రీవల్లి | Tennis champions Ayub,Srivalli | Sakshi
Sakshi News home page

టెన్నిస్ చాంప్స్ అయూబ్, శ్రీవల్లి

May 21 2014 12:13 AM | Updated on Sep 4 2018 5:07 PM

ఐటా టాలెంట్ సిరీస్ జూనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో అమాన్ అయూబ్‌ఖాన్, శ్రీవల్లి రష్మిక టైటిల్స్ సాధించారు. సూర్య టెన్నిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోయిన్‌పల్లిలోని పల్లవి స్కూల్ ప్లే గ్రౌండ్స్‌లో జరిగిన తుదిపోరులో అయూబ్, శ్రీవల్లి గెలిచారు.

 ఐటా టాలెంట్ సిరీస్ టెన్నిస్
 సాక్షి, హైదరాబాద్: ఐటా టాలెంట్ సిరీస్ జూనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో అమాన్ అయూబ్‌ఖాన్, శ్రీవల్లి రష్మిక టైటిల్స్ సాధించారు. సూర్య టెన్నిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోయిన్‌పల్లిలోని పల్లవి స్కూల్ ప్లే గ్రౌండ్స్‌లో జరిగిన తుదిపోరులో అయూబ్, శ్రీవల్లి గెలిచారు. బాలుర అండర్-14 ఫైనల్లో మూడో సీడ్ అయూబ్ ఖాన్ 6-4, 6-4తో నాలుగో సీడ్ సిక్కా సంచిత్‌పై గెలుపొందాడు.
 
 బాలికల టైటిల్ పోరులో టాప్ సీడ్ శ్రీవల్లి రష్మిక 6-2, 6-2తో రెండో సీడ్  ఐశ్వర్యపై విజయం సాధించింది. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆర్మీ బ్రిగేడ్ కల్నల్ రాంబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టెన్నిస్ సంఘం (ఏపీఎల్‌టీఏ) సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ భార్గవ్, సూర్య టెన్నిస్ ఫౌండేషన్ డెరైక్టర్ ఏఆర్ రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement