తెలంగాణ ప్రీమియర్‌ లీగ్‌ షురూ | Telangana Premier League Started | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రీమియర్‌ లీగ్‌ షురూ

Mar 24 2018 10:23 AM | Updated on Sep 4 2018 5:07 PM

Telangana Premier League Started - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రీమియర్‌ లీగ్‌ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌ నగర మేయర్‌ బొంతు రామ్మోహన్, శాట్స్‌ చైర్మన్‌ ఎ. వెంకటేశ్వర్‌ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ పోటీలను ప్రారంభించారు. ఖైరతాబాద్‌ తెరాస ఇన్‌చార్జ్‌ మన్నెం గోవర్దన్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఏప్రిల్‌ 1 వరకు ఎల్బీస్టేడియంలో జరిగే ఈ లీగ్‌లో 12 జట్లు పాల్గొంటున్నాయి.  

లీగ్‌లో పాల్గొనే జట్లు: నల్లగొండ నవాబ్స్, రంగారెడ్డి రాయల్స్, డెక్కన్‌ థండర్స్, ఖమ్మం కమాండర్స్, హైదరాబాద్‌ కింగ్స్, మహబూబ్‌నగర్‌ స్టార్స్, వరంగల్‌ రైడర్స్, సికింద్రాబాద్‌ సూపర్‌ కింగ్స్, మెదక్‌ లయన్స్, సైబరాబాద్‌ చాంప్స్, నిజామాబాద్‌ నిజామ్స్, కరీంనగర్‌ లెజెండ్స్‌.   

Advertisement
 
Advertisement
Advertisement