ఆసియా టెన్నిస్‌ చాంప్‌ సంజన | Telangana girl Sanjana clinch under 14 asia tennis championship title | Sakshi
Sakshi News home page

ఆసియా టెన్నిస్‌ చాంప్‌ సంజన

Nov 11 2017 10:43 AM | Updated on Nov 11 2017 10:43 AM

Telangana girl Sanjana clinch under 14 asia tennis championship title - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆసియా టెన్నిస్‌ అండర్‌–14 చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి సంజన సిరిమల్ల అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌లో జరిగిన ఈ టోర్నీలో 13 ఏళ్ల సంజన చాంపియన్‌గా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన మహిళల తుది పోరులో సంజన 6–2, 6–2తో కుంకుమ్‌ నీల (తెలంగాణ)పై విజయం సాధించింది. అంతకుముందు సెమీస్‌లో సంజన 6–1, 4–6, 6–0తో హిత్వీ చౌదరి (గుజరాత్‌)పై గెలుపొందింది.

Advertisement
 
Advertisement
Advertisement