ఇది క్రీడాస్పూర్తి అంటే.!

TeamIndia to Ask Afgan Players To Pose Them With the Trophy - Sakshi

బెంగళూరు : చారిత్రక టెస్టును ఫటాఫట్‌గా ముగించి చారిత్రాత్మక విజయం సాధించిన టీమిండియా ప్రత్యర్థిని గౌరవించి క్రీడాస్ఫూర్తిలోనూ గెలిచింది. ఏకైక టెస్టులో విజయానంతరం ట్రోఫీని అందుకున్న టీమిండియా కెప్టెన్‌ రహానే తర్వాత టీమిండియా సహచరులతో కలిసి ఫొటోకు ఫోజిచ్చాడు.అనంతరం ప్రత్యర్థి ఆటగాళ్లైన అఫ్గాన్‌ ఆటగాళ్లను సాదరంగా ఆహ్వానించి ట్రోఫీతో ఉమ్మడిగా ఫొటో దిగారు. అయితే భారత ఆటగాళ్లు కనబర్చిన క్రీడాస్తూర్తిని యావత్‌ క్రికెట్‌ ప్రపంచం కొనియాడుతోంది.

‘అరే భారత ఆటగాళ్లది ఏం క్రీడా స్పూర్తి.. అందరం కలసి ట్రోఫితో ఫోజిద్దామని ప్రత్యర్థి ఆటగాళ్లను అడగడం.. ఇది మరో టెస్ట్‌ ఆడటం కన్నా ఎక్కువ’  అని బీసీసీఐ భారత ఆటగాళ్లను కొనియాడుతూ సదరు వీడియోను ట్వీట్‌ చేసింది. అయితే ఈ స్పూర్తికి ముగ్దులైన దిగ్గజ ఆటగాళ్లు,  అభిమానులు టీమిండియాపై ప్రశంసల జల్లు కురిపించారు. రహానే ప్రత్యర్థి ఆటగాళ్లను ఆహ్వానించడం గొప్ప విషయం అని కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ కొనియాడాడు. ‘అద్భుతమైన క్రీడాస్పూర్తి’ అని ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ ట్వీట్‌ చేయగా.. అందమైన ఫోజు అంటూ భారత దిగ్గజం వీవీఎస్‌ లక్ష్మణ్‌ ట్వీట్‌ చేశాడు. ‘జెంటిల్‌మెన్‌ గేమ్‌.. అద్భుతమైన క్రీడాస్పూర్తి’ అని టీమిండియా వికెట్‌ కీపర్‌ వృద్దిమాన్‌ సాహా ట్వీట్‌ చేశాడు. ఈ దృశ్యం తమ మనసులను హత్తుకుందని, భారత్‌-అఫ్గాన్‌ స్నేహం ఇలానే ఉండాలని, ఇరు జట్లు అన్నదమ్ములని, భవిష్యత్తులో అఫ్గాన్‌ బాగా రాణించాలని అభిమానులు కామెంట్‌ చేశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top