
టీమిండియా ఓపెనర్ అజ్యింకా రహానే అవుట్(57/2)
ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో టీమిండియా 57 పరుగుల వద్ద రెండో వికెట్ ను కోల్పోయింది.
బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో టీమిండియా 57 పరుగుల వద్ద రెండో వికెట్ ను కోల్పోయింది. ఓపెనర్ అజ్యింకా రహానే(33) పరుగులు చేసి ఫిన్ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరాడు. ఆదిలోనే శిఖర్ ధావన్ వికెట్(1) ను కోల్పోయిన టీమిండియా ఆ తర్వాత కుదురుగా ఆడింది.
ఇంగ్లండ్ బౌలర్లలో అండర్ సన్, ఫిన్ లకు తలో వికెట్ దక్కింది. నేటి మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.