వన్డే మ్యాచ్ కు మరోసారి వరుణుడు ఆటంకం | team india and australi match delayed by rain | Sakshi
Sakshi News home page

వన్డే మ్యాచ్ కు మరోసారి వరుణుడు ఆటంకం

Jan 26 2015 11:38 AM | Updated on Sep 2 2017 8:18 PM

ముక్కోణపు సిరీస్ లో టీమిండియా-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న ఐదో లీగ్ మ్యాచ్ కు వరుణుడు పదేపదే ఆటంకం కల్గిస్తున్నాడు.

సిడ్నీ: ముక్కోణపు సిరీస్ లో టీమిండియా-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న ఐదో లీగ్ మ్యాచ్ కు వరుణుడు పదేపదే ఆటంకం కల్గిస్తున్నాడు. టీమిండియా 16 ఓవర్లలో రెండు వికెట్లు నష్టానికి 69 పరుగుల వద్ద ఉండగా మరోసారి వర్షం పడింది.  దీంతో మ్యాచ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి అజ్యింకా రహానే(28), విరాట్ కోహ్లీ(3)పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇప్పటికే వర్షం రెండు సార్లు ఆటంకం కల్గించడంతో మ్యాచ్ ను 44 ఓవర్లకు కుదించారు.

Advertisement
 
Advertisement
Advertisement