క్రికెట్‌ అభివృద్ధికి హెచ్‌సీఏ ఏం చేసింది? | tca president lakshminarayana slams hca president vivek | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ అభివృద్ధికి హెచ్‌సీఏ ఏం చేసింది?

Feb 11 2018 10:44 AM | Updated on Feb 11 2018 10:44 AM

tca president lakshminarayana slams hca president vivek - Sakshi

హైదరాబాద్‌: క్రికెట్‌ అభివృద్ధి కోసం హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) తీసుకున్న చర్యలేమిటో వివరించాలని ‘ది తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌’ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎ.లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ కార్యదర్శి గురువారెడ్డితో కలిసి హెచ్‌సీఏపై ధ్వజమెత్తారు. వివేక్‌ దిగిపోవాలని వారి కమిటీ సభ్యులే డిమాండ్‌ చేస్తున్నారని అన్నారు.

ఇప్పటికే క్రికెట్‌ కోసం ఏం చేశారో వివరించాలని హెచ్‌సీఏను బీసీసీఐ కోరడంతో ఏం తోచని సందిగ్ధావస్థలో ఉన్నారని ఆరోపించారు. టీటీఎల్‌ను నిర్వహించే హక్కు వివేక్‌కు లేదని పేర్కొన్నారు. టీటీఎల్‌లో తెలంగాణ వారు చాలా తక్కువ మంది ఉన్నారన్న లక్ష్మీనారాయణ డబ్బులు తీసుకొని ఆ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. వివేక్‌ బినామీ పేర్ల మీద క్రికెట్‌ క్లబ్‌లు నడుపుతున్నారని, త్వరలో అన్నీ బయట పడతాయని దుయ్యబట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement