మెరిసిన సిరాజ్, మెహదీ హసన్‌ 

Syed Mushtaq Ali Trophy Hyderabad Beat Chandigarh By 5 Wickets - Sakshi

హైదరాబాద్‌కు రెండో గెలుపు

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 క్రికెట్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: వరుస ఓటములకు హైదరాబాద్‌ జట్టు ఫుల్‌స్టాప్‌ పెట్టింది. దేశవాళీ టి20 క్రికెట్‌ టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో హైదరాబాద్‌ రెండో విజయాన్ని అందుకుంది. మంగళవారం చండీగఢ్‌లో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు 5 వికెట్ల తేడాతో చండీగఢ్‌పై విజయం సాధించింది. మొదట బౌలింగ్‌లో మొహమ్మద్‌ సిరాజ్‌ (3/15), మెహదీ హసన్‌ (3/23) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి ప్రత్యరి్థని కుప్పకూల్చారు. దీంతో చండీగఢ్‌ 19.5 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటైంది. అనంతరం హైదరాబాద్‌ మరో ఓవర్‌ మిగిలి ఉండగానే 5 వికెట్లు నష్టపోయి 126 పరుగులు చేసింది. ఛేదనలో కాస్త తడబడినా బావనక సందీప్‌ (39 బంతుల్లో 32 నాటౌట్‌; ఫోర్‌) జట్టుకు విజయాన్ని అందించాడు.  

నిప్పులు చెరిగిన బౌలర్లు... 
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చండీగఢ్‌ను హైదరాబాద్‌ బౌలర్లు ఆరంభం నుంచే బెంబేలెత్తించారు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ మూడో బం తికే అమిత్‌ (0)ను  సిరాజ్‌ ఔట్‌ చేశాడు. రెండో ఓవర్‌ చివరి బంతికి సారథి మనన్‌ వోహ్రా (1)ని యు«ద్‌వీర్‌ సింగ్‌ పెవిలియన్‌కు పంపి ప్రత్యర్థిని ఇరకాటంలోకి నెట్టాడు. అయితే ఈ దశలో జత కలిసిన శివమ్‌ బాంబ్రీ (14 బంతు ల్లో 12; 2 ఫోర్లు), గౌరవ్‌ పురి (13 బంతుల్లో 19; 3 ఫోర్లు, సిక్స్‌) జోడీ జట్టును ఆదుకునే ప్రయత్నం చేసింది. అయితే ఈ దశలో బౌలింగ్‌కు వచి్చన మెహదీ హసన్‌ వరుస బంతుల్లో శివమ్, గౌరవ్‌ పురిలను ఔట్‌ చేశాడు. దీంతో చండీగఢ్‌ 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. బిపుల్‌ శర్మ (27 బంతుల్లో 35; 3 ఫోర్లు, సిక్స్‌), గురీందర్‌ సింగ్‌ (18 బంతుల్లో 20; ఫోర్, సిక్స్‌) ఆదుకున్నారు. చివర్లో సిరాజ్‌ మరోసారి కీలకమైన సమయంలో వికెట్లు తీయడంతో ప్రత్యర్థి జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. యుధ్‌వీర్‌ సింగ్‌ రెండు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ వైడ్‌ రూపంలో ఒక్క పరుగును మాత్రమే ప్రత్యర్థికి ఎక్స్‌ట్రా రూపంలో ఇవ్వడం విశేషం. 

తడబడి... నిలబడి 
స్వల్ప విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు తన్మయ్‌ అగర్వాల్‌ (15 బంతు ల్లో 28; 6ఫోర్లు) అదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. దీంతో తొలి మూడు ఓవర్లలోనే హైదరాబాద్‌ 35 పరుగులు చేసింది. ఈ దశలో ప్రత్యర్థి బౌల ర్లు పుంజుకొని రాయుడు (10; ఫోర్‌), తన్మయ్, అక్షత్‌ రెడ్డి (0), హిమాలయ్‌ (8) వెంటవెంటనే ఔట్‌ చేసి హైదరాబాద్‌ శిబిరంలో ఆందోళ న కలిగించారు. ఇక్కడ హైదరాబాద్‌ 12 పరుగుల తేడాలో నాలుగు వికెట్లను కోల్పోయింది. మరో ఓటమి ఖాయం అనుకునే సమయంలో బావనక సందీప్‌ నేనున్నానంటూ ఆదుకున్నా డు. అతడు మల్లికార్జున్‌ (27 బంతుల్లో 22; సిక్స్‌), చామా మిలింద్‌ (17 బంతుల్లో 23 నాటౌట్‌; 2 ఫోర్లు, సిక్స్‌)లతో కలిసి జట్టుకు విజయాన్ని ఖాయం చేశాడు. 

స్కోరు వివరాలు 
చండీగఢ్‌ ఇన్నింగ్స్‌: వోహ్రా (సి) మల్లికార్జున్‌ (బి) యు«ద్‌వీర్‌ 1; అమిత్‌ (ఎల్బీ) (బి) సిరాజ్‌ 0; శివమ్‌ (సి) యుధ్‌వీర్‌ (బి) మెహదీ హసన్‌ 12; గౌరవ్‌ పురి (సి) రాయుడు (బి) మెహదీ హసన్‌ 19; జస్కరన్‌వీర్‌ సింగ్‌ (సి) యు«ద్‌వీర్‌ (బి) ఆకాశ్‌ 14; బిపుల్‌ శర్మ (సి) తన్మయ్‌ (బి) మిలింద్‌ 35; జస్కరన్‌ సింగ్‌ (బి) మెహదీ హసన్‌ 12; గురీందర్‌ సింగ్‌ (సి) మల్లికార్జున్‌ (బి) సిరాజ్‌ 20; గౌరవ్‌ గంభీర్‌ (ఎల్బీ) (బి) యుద్‌వీర్‌ 3; శరణ్‌ (సి) ఆకాశ్‌ (బి) సిరాజ్‌ 5; శ్రేష్ట్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్‌) 123  
వికెట్ల పతనం: 1–1, 2–5, 3–32, 4–42, 5–52, 6–76, 7–100, 8–106, 9–118, 10–123. 
బౌలింగ్‌: సిరాజ్‌ 3.5–0–15–3, యుధ్‌వీర్‌ సింగ్‌ 4–0–37–2, మిలింద్‌ 4–0–24–1, మెహదీ హసన్‌ 4–0–23–3, బావనక సందీప్‌ 2–0–13–0, ఆకాశ్‌ భండారి 2–0–11–1. 

హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: తన్మయ్‌ (బి) జస్కరన్‌ 28; రాయుడు (బి) శ్రేష్ట 10; హిమాలయ్‌ (సి) గౌరవ్‌ పురి (బి) శ్రేష్ట్‌ 8; అక్షత్‌ రెడ్డి (సి) గౌరవ్‌ గంభీర్‌ (బి) జస్కరన్‌ 0; సందీప్‌ (నాటౌట్‌) 32 మల్లికార్జున్‌ (సి) జస్కరన్‌వీర్‌ సింగ్‌ (బి) గురీందర్‌ సింగ్‌ 22; మిలింద్‌ (నాటౌట్‌) 23; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (19 ఓవర్లలో 5 వికెట్లకు) 123  
వికెట్ల పతనం: 1–35, 2–43, 3–43, 4–47, 5–90. 
బౌలింగ్‌: బిపుల్‌ శర్మ 4–0–19–0, శ్రేష్ట్‌ నిర్మోహి 3–0–23–2, శరణ్‌ 4–0–36–0, జస్కరన్‌ సింగ్‌ 4–0–17–2, గౌరవ్‌ గంభీర్‌ 1–0–10–0, గురీందర్‌ సింగ్‌ 3–0–19–1.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top