‘సూర్య' ప్రతాపం... | 'Surya' appreciation ... | Sakshi
Sakshi News home page

‘సూర్య' ప్రతాపం...

Sep 25 2014 1:31 AM | Updated on Sep 2 2017 1:54 PM

‘సూర్య' ప్రతాపం...

‘సూర్య' ప్రతాపం...

భారత క్రికెట్ చరిత్రలో వరుసగా 12 టి20 మ్యాచ్‌లు గెలిచిన జట్టు బెంగాల్. ఇప్పుడు కోల్‌కతా నైట్‌రైడర్స్ కూడా అదే ఘనతను సాధించింది.

భారత క్రికెట్ చరిత్రలో వరుసగా 12 టి20 మ్యాచ్‌లు గెలిచిన జట్టు బెంగాల్. ఇప్పుడు కోల్‌కతా నైట్‌రైడర్స్ కూడా అదే ఘనతను సాధించింది. తమ ‘సొంత'జట్టు రికార్డును అందుకుంది. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో అదరగొడుతున్న గంభీర్ సేన... చాంపియన్స్ లీగ్‌లో వరుసగా మూడో మ్యాచ్‌లో గెలిచింది. ఇక ఏదైనా అనూహ్యం జరిగితే తప్ప ఈ జట్టు సెమీస్‌కు చేరినట్లే.
 
 సాక్షి, హైదరాబాద్: ప్రత్యర్థి ఎవరైనా కట్టిపడేసే బౌలర్లు... ఒకరు విఫలమైతే మరొకరు రాణించే బ్యాటింగ్ లైనప్... ఇలాంటి సమతూకంతోనే కోల్‌కతా జట్టు భారత్‌లో అత్యధిక వరుస టి20 మ్యాచ్‌ల విజయాల రికార్డును సమం చేసింది. సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 43 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌తో... బుధవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ 3 వికెట్ల తేడాతో పెర్త్ స్కార్చర్స్‌పై నెగ్గింది.
 టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పెర్త్ స్కార్చర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు చేసింది. వోజెస్ (52 బంతుల్లో 71 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా... సిమ్మన్స్ (30 బంతుల్లో 39; 6 ఫోర్లు, 1 సిక్స్), వైట్‌మ్యాన్ (16 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. చివర్లో మ్యాజిక్ స్పిన్నర్ నరైన్ వరుస విరామాల్లో వికెట్లు తీసి పెర్త్‌ను దెబ్బతీశాడు. ఏడు బంతుల వ్యవధిలో మూడు వికెట్లు తీశాడు. ఓ ఎండ్‌లో చకచకా వికెట్లు పడుతున్నా... రెండో ఎండ్‌లో వోజెస్ బ్యాట్ ఝళిపించడంతో పెర్త్ చివరి 5 ఓవర్లలో 75 పరుగులు సాధించింది. నరైన్ 4, కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీశారు.
 తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 19.4 ఓవర్లలో 7 వికెట్లకు 153 పరుగులు చేసి నెగ్గింది. గంభీర్ (2), కలిస్ (6), ఉతప్ప (23), మనీష్ పాండే (24), డష్కటే (15)... ఐదుగురూ 87 పరుగులకే పెవిలియన్‌కు చేరారు. దీంతో కోల్‌కతా కష్టాల్లో పడింది. అయితే సూర్యకుమార్, యూసుఫ్ పఠాన్ (20 బంతుల్లో 21; 2 సిక్సర్లు) కీలక భాగస్వామ్యంతో ఆదుకున్నారు.  ముఖ్యంగా సూర్యకుమార్ సంచలన ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను గెలిపించాడు. విజయానికి చివరి 12 బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన దశలో... సూర్యకుమార్ రెండు సిక్సర్లతో ఒకే ఓవర్లో 19 పరుగులు రాబట్టాడు. చివరి ఓవర్‌లో రస్సెల్ (4) అవుటైనా, చావ్లా (5 నాటౌట్)తో కలిసి జట్టును గెలిపించాడు. అరాఫత్ 3, కోల్టర్ నైల్ 2 వికెట్లు తీశారు.  కుల్దీప్ యాదవ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
 స్కోరు వివరాలు:
 పెర్త్ స్కార్చర్స్ ఇన్నింగ్స్: వోజెస్ నాటౌట్ 71; సిమ్మన్స్ (స్టం) ఉతప్ప (బి) కుల్దీప్ 39; మార్ష్ (స్టం) ఉతప్ప (బి) కుల్దీప్ 4; వైట్‌మ్యాన్ (సి) సూర్య (బి) నరైన్ 21; కోల్టర్ నైల్ (సి) అండ్ (బి) కుల్దీప్ 0; ఎగర్ (బి) నరైన్ 4; టర్నర్ (బి) నరైన్ 0; అరాఫత్ (సి) గంభీర్ (బి) నరైన్ 10; బెహరెన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 151.
 వికెట్ల పతనం: 1-68; 2-81; 3-120; 4-120; 5-132; 6-132; 7-150. బౌలింగ్: పఠాన్ 4-0-22-0; కలిస్ 4-0-39-0; కుల్దీప్ 4-0-24-3; నరైన్ 4-0-31-4; చావ్లా 4-0-35-0.
 కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) వైట్‌మ్యాన్ (బి) కోల్టర్ నైల్ 23; గంభీర్ (సి) టర్నర్ (బి) పారిస్ 2; కలిస్ (సి) సిమ్మన్స్ (బి) బెహరెన్‌డాఫ్ 6; మనీష్ పాండే (బి) కోల్టర్ నైల్ 24; టెన్‌డస్కటే (సి) ఎగర్ (బి) అరాఫత్ 15; యూసుఫ్ (సి) బెహరెన్‌డాఫ్ (బి) అరాఫత్ 21; సూర్యకుమార్ నాటౌట్ 43; రస్సెల్ (బి) అరాఫత్ 4; చావ్లా నాటౌట్ 5; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: (19.4 ఓవర్లలో 7 వికెట్లకు) 153.
 వికెట్ల పతనం: 1-6; 2-13; 3-37; 4-67; 5-87; 6-125; 7-147. బౌలింగ్: బెహరెన్‌డాఫ్ 4-0-28-1; పారిస్ 3-0-19-1; కోల్టర్ నైల్ 4-0-41-2; ఎగర్ 1-0-4-0; అరాఫత్ 3.4-0-39-3; హాగ్ 4-0-19-0.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement