సునీల్ నరైన్ ఇంటికి... | Sunil Narine is to home ... | Sakshi
Sakshi News home page

సునీల్ నరైన్ ఇంటికి...

Oct 5 2014 1:58 AM | Updated on Sep 2 2017 2:20 PM

సునీల్ నరైన్ ఇంటికి...

సునీల్ నరైన్ ఇంటికి...

న్యూఢిల్లీ: సందేహాస్పద బౌలింగ్ యాక్షన్‌తో చాంపియన్స్ లీగ్ ఫైనల్‌కు దూరమైన వెస్టిండీస్ స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్ భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌కూ దూరమయ్యాడు.

వన్డే సిరీస్ నుంచి వైదొలగిన స్పిన్నర్

 న్యూఢిల్లీ: సందేహాస్పద బౌలింగ్ యాక్షన్‌తో చాంపియన్స్ లీగ్ ఫైనల్‌కు దూరమైన వెస్టిండీస్ స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్ భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌కూ దూరమయ్యాడు. అతని బౌలింగ్ యాక్షన్‌కు సంబంధించిన తాజా పరిణామాల అనంతరం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు నరైన్‌ను స్వదేశం రావాల్సిందిగా ఆదేశించింది. ‘రాబోయే సిరీస్ నుంచి నరైన్‌ను తప్పిస్తున్నాం. అతను తన యాక్షన్‌ను సమీక్షించుకొని క్రికెట్‌లోకి తిరిగి వచ్చేందుకు ఈ విరామం ఉపయోగపడుతుంది’ అని విండీస్ బోర్డు ప్రకటించింది. నరైన్ తప్పుకోవడంతో వెస్టిండీస్ జట్టు స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండానే భారత్‌తో సిరీస్ బరిలోకి దిగనుంది.




 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement