‘స్ట్రాంగ్‌మాన్’ స్టీఫెన్ | 'Strangman' Stephen | Sakshi
Sakshi News home page

‘స్ట్రాంగ్‌మాన్’ స్టీఫెన్

Jul 27 2014 11:49 PM | Updated on Sep 2 2017 10:58 AM

హైదరాబాద్ జిల్లా సీనియర్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో స్టీఫెన్ మెరిశాడు. జిల్లా పవర్‌లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడి ఎల్బీ స్టేడియంలో ఆదివారం జరిగిన 61 కేజీల విభాగం ఫైనల్లో స్టీఫెన్ అత్యుత్తమ పవర్‌లిఫ్టర్‌గా ఎంపికయ్యాడు.

 హైదరాబాద్ జిల్లా సీనియర్ పవర్‌లిఫ్టింగ్
 ఎల్బీ స్టేడియం: హైదరాబాద్ జిల్లా సీనియర్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో స్టీఫెన్ మెరిశాడు. జిల్లా పవర్‌లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడి ఎల్బీ స్టేడియంలో ఆదివారం జరిగిన 61 కేజీల విభాగం ఫైనల్లో స్టీఫెన్ అత్యుత్తమ పవర్‌లిఫ్టర్‌గా ఎంపికయ్యాడు. దీంతో అతనికి హైదరాబాద్ ‘స్ట్రాంగ్ మాన్’ అవార్డు దక్కింది. ఈ పోటీల విజేతలకు బేగంబజార్ డివిజన్ జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ శంకర్ యాదవ్ పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్య సమాజ్ ప్రధాన కార్యదర్శి గోవింద్ రాజ్, తెలంగాణ పవర్ లిఫ్టింగ్ సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.
 
 ఫైనల్స్ ఫలితాలు: 59 కేజీలు: 1.జి.రమేష్ (460 కేజీలు), 2.బి.పవన్ కుమార్, 3.ఎం.భాను ప్రకాష్. 66 కేజీలు: 1.కె.స్టీఫెన్ (565 కేజీలు), 2.కె.దినేష్, 3.డి.శివకుమార్. 74 కేజీలు: 1.ఎం.జానకిరామ్ (570  కేజీలు), 2.జి.శేషు, 3. కె.మనోజ్ యాదవ్. 83 కేజీలు:1.ఎన్.అంజయ్య (572.5 కేజీలు), 2.ఎస్.కృష్ణ, 3.జె.నరేందర్. 93 కేజీలు: 1.కె.సంతోష్ (425 కేజీలు), 2. కె.శ్రీకాంత్, 3.ఎ.విక్టర్. 105 కేజీలు: 1.వై. రాఘవేంద్ర గౌడ్ (765 కేజీలు), 2.ఆర్.ఉదయ్ కృష్ణ. 120 కేజీలు: 1.ఎల్.ప్రవీణ్ (752 కేజీలు). ప్లస్ 120 కేజీలు: 1.బి.సుమిత్ (747.5 కేజీలు).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement