కోహ్లి కాదు.. మాట మార్చాడు! | Steve Smith is the toughest batsman to bowl, Mohammad Amir | Sakshi
Sakshi News home page

కోహ్లి కాదు.. మాట మార్చాడు!

Jul 6 2018 12:56 PM | Updated on Jul 6 2018 12:57 PM

Steve Smith is the toughest batsman to bowl, Mohammad Amir - Sakshi

హరారే: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి-పాకిస్తాన్‌ పేసర్‌ మొహ్మద్‌ అమిర్‌ల సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో వీరిద్దరూ ఒకరిపై ఒకరు ప్రశంసల వర్షం కురిపించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. తనకు ఎదురైన అత్యంత క్లిషమైన బౌలర్‌ అమిర్‌ అని కోహ్లి అంటే.. అందుకు బదులుగా తాను ఎదుర్కొన్న కఠినమైన బ్యాట్స్‌మన్‌ కోహ్లి అని అమిర్‌ కూడా పలుసార్లు స్పష్టం​ చేశాడు. అయితే తాజాగా అమిర్‌ మాట మార్చాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో ఆసీస్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌కే బౌలింగ్‌ చేయడం కష్టమని తాజాగా పేర్కొన్నాడు. స్మిత్‌కు బౌలింగ్‌ చేయడమంటే ఒక సవాల్‌తో కూడున్నదని అమిర్‌ పేర్కొన్నాడు. ఒక వార్తా సంస్థకు ఇంటర్య్వూ ఇచ్చే క్రమంలో ‘ మీకు ఎదురైన కఠినమైన బ్యాట్స్‌మన్‌ ఎవరు’ అని దానికి అమిర్‌ పైవిధంగా స్పందించాడు.

బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో చిక్కుకున్న స్మిత్‌ 12 నెలల పాటు అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. తన కెరీర్‌లో స్మిత్‌ 64 టెస్టులకు గాను 6,199 పరుగులు సాధించాడు. ఇందులో 61.38 సగటుతో 23 సెంచరీలు స్మిత్‌ నమోదు చేశాడు. ఇక ఇప‍్పటివరకూ 66 టెస్టులు ఆడిన కోహ్లి 5, 554 పరుగులు సాధించాడు. 53కు పైగా సగటుతో 21 సెంచరీలు కోహ్లి సొంతం.

మరొకవైపు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో స్మిత్‌పై కోహ్లిదే పైచేయి. 208 వన్డేల్లో 58.11 సగటుతో 9,588 పరుగుల్ని కోహ్లి సాధించాడు. ఇందులో 35 సెంచరీలున్నాయి. అంతర్జాతీయ టీ 20ల్లో 60 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 49.07 సగటుతో 2,012 పరుగులు చేశాడు. ఇక స్మిత్‌ విషయానికొస్తే.. 108 వన్డేలు ఆడి 44పైగా సగటుతో 3,431 పరుగులు నమోదు చేశాడు. ఇందులో 8 సెంచరీలను స్మిత్‌ సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో 30 మ్యాచ్‌లు ఆడి  21.55 యావరేజ్‌తో 431 పరుగుల్ని మాత‍్రమే స్మిత్‌ నమోదు చేశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement