ఇదేం న్యాయం? | Star and Sony Unhappy After BCCI Wants Same Money for India and Non-India Matches | Sakshi
Sakshi News home page

ఇదేం న్యాయం?

Mar 31 2018 4:12 AM | Updated on Mar 31 2018 4:12 AM

Star and Sony Unhappy After BCCI Wants Same Money for India and Non-India Matches - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో నిర్వహించే మ్యాచ్‌ల ప్రసార హక్కుల విషయంలో బిడ్‌లు దాఖలు చేసిన రెండు కంపెనీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మ్యాచ్‌లకు సంబంధించిన చెల్లింపులపై చివరి నిమిషంలో బీసీసీఐ మార్పులు చేయడంపై ఆగ్రహంతో ఉన్నాయి. ఏప్రిల్‌ 3న బిడ్‌ దాఖలు చేయాల్సి ఉండగా... పోటీపడ్డ స్టార్‌ ఇండియా, ఎస్పీఎన్‌ (సోనీ కార్పోరేషన్‌)లు ఈ అంశంపై బీసీసీఐకి లేఖ రాశాయి.

ప్రసార హక్కులు పొందిన సంస్థ... సొంత గడ్డపై నిర్వహించే అన్ని మ్యాచ్‌లకు ఒకే మొత్తంలో చెల్లించడం ఎలా సాధ్యమని అందులో పేర్కొన్నాయి. టి20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, ముక్కోణపు టోర్నీల వంటి సిరీస్‌లలో భారత్‌ పాల్గొనే మ్యాచ్‌కు, పాల్గొనని మ్యాచ్‌కు ఒకే మొత్తం చెల్లించాల్సి రావడం ఇబ్బందికరం అని స్పష్టం చేశాయి. భారత్‌ బరిలో ఉంటే చూసే ప్రేక్షకుల సంఖ్యకు, లేకుంటే చూసేవారికి వ్యత్యాసం ఉంటుంది కాబట్టి ఇది సబబు కాదని... తక్షణమే దాన్ని సవరించాలని కోరాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement